ఖమ్మం

విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక దృక్పథం పెరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 20: చిన్నతనంలోనే పిల్లలకు శాస్త్ర, సాంకేతికత దృక్పథం అలవడాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యాబోధన చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమశాఖ సహకారంతో భద్రాచలంలోని గిరిజన గురుకుల పాఠశాలలోని అబ్దుల్‌కలాం ప్రాంగణంలో 3రోజుల పాటు నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మంగళవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. శాస్ర్తియ దృక్పథం పెరిగినప్పుడే పిల్లలు సమాజాభివృద్ధికి దోహదపడే అద్భుత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుతారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అద్భుత నైపుణ్యాలు, వారి ప్రదర్శనల ద్వారా ప్రస్పుటమయ్యాయని, ఆశ్చర్య చకితులను గావించే అద్భుత ప్రతిభ వారిలో దాగి ఉందని కలెక్టర్ కొనియాడారు. గిరిజన ప్రాంతానికి చెందిన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొనడం అభినందనీయమన్నారు. గణిత ప్రక్రియలలో స్వయంగా కలెక్టర్ పాల్గొని సంఖ్యలు ఇచ్చి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల ప్రతిభకు ముగ్ధులైన కలెక్టర్ వారిని అభినందించారు. వ్యవసాయం, సేంద్రియ పద్ధతులు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి యాజమాన్య పద్ధతులు, వనరుల వినియోగం తదితర అంశాలను కలెక్టర్ ఆసక్తిగా తిలకించి విద్యార్థులను ప్రశంసించారు. లో కాస్ట్, నో కాస్ట్ ప్రదర్శనలను, ప్లాస్టిక్ రోడ్‌ల నిర్మాణం ద్వారా నీటి దుర్వినియోగాన్ని అరికడుతూ సమర్థవంతమైన రవాణా వ్యవస్థను ప్రదర్శించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఉత్తమ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి మాట్లాడుతూ 480 ప్రదర్శనలు నిర్వహించగా సుమారు 5200 మంది విద్యార్థులు తిలకించి జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేశారన్నారు. అన్ని కమిటీల సహకారంతో 46వ జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ సైన్స్, మేథమెటిక్స్ ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిబిషన్ ఫర్ చిల్డ్రన్-2018 విజయవంతమైందని, దీనికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలని డీఈవో పేర్కొన్నారు. అనంతరం కమిటీల కన్వీనర్లు నీరజ, రమణ, మేరిశ్రీ, కాంతారావు, నర్సయ్య, పి.నర్సింహారావు, కుమారి, వీరమ్మ, సావిత్రి, వీరాకుమారి, అరుణకుమారి, నాగమణి, మోతీరు, రామారావు, ఏవీ రామారావు, బోళ్ళ వెంకటేశ్వర్లు, ఆర్.వెంకటేశ్వర్లు, భద్రు, స్వరూప్, శ్రీనివాస్ తదితరులకు మెమొంటోలు, ప్రశంసాపాత్రాలను డీఈవో అందజేశారు. నోడల్ అధికారి ఎస్.మాధవరావు, కళాశాల ప్రిన్సిపాల్ దేవదాసులకు ప్రత్యేక ప్రశంసాపత్రం అందించారు. కార్యక్రమంలో డీఎస్‌వో చలపతిరాజు, ఏటీడీవో జహీరుద్దీన్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ సాయన్న, ఏటీవో రమణయ్య, జయబాబు, తావుర్యా, వ్యాఖ్యాత సురేష్, వి.రాంబాబు, సైదులు, గోపాలకృష్ణ, ఎంఈవో సమ్మయ్య, వీరాస్వామి, రమణలు పాల్గొన్నారు.

అదరగొట్టిన ఆశ్రమ విద్యార్థులు
* వైజ్ఞానికి ప్రదర్శనలో అద్భుత ప్రదర్శనలు
భద్రాచలం టౌన్, నవంబర్ 20: భద్రాచలంలో మూడురోజుల పాటు నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను తమలోని నైపుణ్యాన్ని చూపించి ప్రదర్శనల్లో అద్భుత ప్రతిభ కనబర్చారు. వారు రూపొందించిన ప్రదర్శనలు ఆలోచింపజేసేలా ఉండటంతో పలువురు వాటిని ఆసక్తిగా తిలకించడమే కాకుండా ప్రశంసలు కురిపించారు. ఈ వైజ్ఞానికి ప్రదర్శనలో రేగుబల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన కె.కళ్యాణి వ్యవసాయం నిర్వహణలో విజేతగా నిలిచింది. అలాగే వ్యర్థాల నిర్వహణలో రేగుబల్లి పాఠశాలకు చెందిన సాయిరేణు, అన్నపురెడ్డిపల్లి ఆశ్రమానికి చెందిన కీర్తి, రవాణా, సమాచారంలో చండ్రుగొండ కేజీబీవీకి చెందిన వి.కావ్య, గణితంలో ములకలపల్లి కేజీబీవీకి చెందినకె.అనిత, కె.రేగుబల్లి ఆశ్రమానికి చెందిన కె.నాగసంధ్య విజేతలుగా నిలిచారు. ఉపాధ్యాయుల ప్రదర్శన విభాగంలో గౌతంపూర్ జెడ్‌పీహెచ్‌ఎస్‌కు చెందిన ఎస్.చంద్రశేఖర్, క్విజ్‌లో ఈ.హరీష్‌రామ్, గానుగులపల్లికి చెందిన కె.నాగశౌర్యతేజ, అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్‌లో కొత్తగూడెం త్రివేణి పాఠశాలకు చెందిన అమృతవర్షిణి, మణుగూరు ఎక్స్‌లెంట్ ఉన్నత పాఠశాలకు చెందిన అభినయ, ఆరోగ్యం పరిశుభ్రత విభాగంలో కొత్తగూడెం సింగరేణి హైస్కూల్‌కు చెందిన పి.నవ్య, గౌతంపూర్ పాఠశాలకు చెందిన ఎస్.్ధనుంజయ్‌శివరాం, వనరుల యాజమాన్యంలో కొత్తగూడెం త్రివేణి హైస్కూల్‌కు చెందిన జి.నిషిత, కొత్తగూడెం సింగరేణి బాలుర పాఠశాలకు చెందిన టి.శివకుమార్ ప్రతిభ చూపి బహుమతులు అందుకున్నారు. వ్యర్థ నిర్వహణలో చుంచుపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎల్.శ్రీనివాస్, భద్రాచలం జిల్లాపరిషత్‌కు చెందిన పి.హేమలత, రవాణా సమాచారంలో సెయింట్‌పాల్స్ విద్యార్థిని కె.రమాశ్రీ, చంద్రశ్రీ, గణితం సీనియర్స్‌లో సెయింట్‌పాల్స్ విద్యార్థిని పి.సాయిపవన్, మణుగూరు సింగరేణి కాలరీస్‌కు చెందిన ఎం.రవిసాయితేజ ఉత్తమ ప్రదర్శనలు ప్రదర్శించారు.