ఖమ్మం

నామినేషన్ పత్రాల స్క్రూటినీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తుపల్లి, నవంబర్ 20: 2018 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం చేపట్టిన షెడ్యుల్‌లో మొదటి అంకం అనగా నామినేషన్‌ల ఘట్టం ప్రశాంతంగా ముగియడంతో మంగళవారం స్క్రూటినీ చేశారు. సత్తుపల్లి శాసనసభ స్థానానికి పలుపార్టీలో పాటు స్వతంత్య్ర అభ్యర్థులుగా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. గడిచిన వారం రోజుల్లో 6 పనిదినాలకు గాను 13మంది అభ్యర్థులు 24 నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కో అభ్యర్థి 3సెట్‌ల నామినేషన్ పత్రాలను రూ.5వేల డిపాజిట్ సొమ్ముతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శివాజీకి అందజేశారు. వీరిలో కొందరు ఒక్కోసారి ఒక్కోసెట్ చొప్పున మరికొందరు 3సెట్‌లను ఒకేసారి అందజేయగా మొత్తం 24 నామినేషన్‌లు అందాయి. వీరిలో టీడీపీ (మహాకూటమి) అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పిడమర్తి రవి, బీజెపి అభ్యర్థులుగా నంబూరి రామలింగేశ్వరరావు, నంబూరి రమాక్రాంతిలు, బీఎస్‌పి నుంచి ప్రేమ్‌నీల్‌కుమార్, ఐపీబీపీ, పిరమిడ్‌ల నుంచి మల్లిఖార్జున్, రవీందర్‌లు సీపీఐ ( ఎం) నుంచి కంచర్ల భారతి, సర్వేశ్వరరావు, ఇండిపెండెంట్‌లుగా అర్జున్, వీణకుమారి, స్వామిలు నామినేషన్‌లు దాఖలు చేశారు. వీరికి సంబంధించిన దృవపత్రాల పరిశీలనలో కొలికపోగు సర్వేశ్వరరావు సీపీఐ (ఎం), మైత్రి రవీందర్ పిరమిడ్ పార్టీల నామినేషన్‌లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు. ఉప సంహరణల అనంతరం ఎన్నికల రణరంగంలో విజేతలుగా నిలిచేదెవరో డిసెంబర్ 11 వ తేదిన తేలనుండగా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్, ప్రజాకూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది.

కుటుంబ సభ్యుడిలా ఆశీర్వదించండి
* నిత్యం మీతోనే ఉంటా
* ప్రజాకూటమి అభ్యర్థి ఉపేందర్‌రెడ్డి
నేలకొండపల్లి, నవంబర్ 20 : మీ కుటుంబ సభ్యుడుగా ఆశీర్వదించండి నిత్యం మీలో ఒకడిగా మీతో ఉంటానని పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని గువ్వలగూడెం, ఆచర్లగూడెం, కోనాయిగూడెం, అమ్మగూడెం, కొరుట్లగూడెం, రాజేశ్వరపురం, శంకరగిరి తండ, మూటపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాలలో కందాల ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనను ఈ ఎన్నికలలో గెలిపిస్తే ప్రజలను గుండెలో పెట్టుకొని వారి అభ్యున్నతికి పాటుపడతానన్నారు. నియోజకవర్గం వాడిగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాన్నారు. పదవిలో ఉన్న లేకపోయిన నిత్యం ప్రజలలో ఉన్నానని ఇప్పడు అవకాశం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ను ప్రజలు ఈ ఎన్నికలలో ఓడించాలన్నారు. అభివృద్ధి పేరుతో కమీషన్‌లకు కక్కుర్తి పడుతున్న టిఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండ చూడాలన్నారు. మొదటి సారిగా మీ అదరణ కోసం మీ ముందుకు వచ్చాన్నారు. ఈ ఎన్నికలలో తనను గెలిపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి స్వర్ణకుమారి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ముందస్తు ఎన్నికలకు పోయిన టిఆర్‌ఎస్‌ను మరల ఎలా ప్రజలు నమ్ముతారన్నారు. రైతులకు బేడీలు వేసి వారిని జైలుపాలు చేశారన్నారు. జనజాగృతి పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బత్తుల సోమయ్య మాట్లాడుతూ తెలంగాణా అమరవీరుల కుటుంబాలను టిఆర్‌ఎస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తెలంగాణాలో ప్రతి కుటుంబాని టిఆర్‌ఎస్ మోసం చేసిందన్నారు. ఈ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ను ఓడించి ప్రజాకూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, మండల నాయకులు హుస్సెన్, నాగరాజు, మామిడి వెంకన్న, జెర్రిపోతుల సత్యనారాయణ, అంజనీ, గోళ్ళ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.