ఖమ్మం

స్వతంత్రులపైనే దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 20: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 246నామినేషన్లు దాఖలు కాగా అందులో 196మంది స్వతంత్రులే ఉన్నారు. స్వతంత్రుల్లో కొందరు తమ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నామినేషన్లు దాఖలు చేయగా మరికొందరు తమ విధానాలను ప్రజలకు తెలియజెప్పేందుకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడం, నామినేషన్ల ఉపసంహరణకు 22వ తేదీ వరకు గడువున్న నేపథ్యంలో స్వతంత్రులను నామినేషన్ ఉపసంహరింపజేసేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం, మహాకూటమి నేతలే వీరికోసం ప్రత్యేకంగా తమ పార్టీలకు చెందిన ప్రధాన నేతలను రంగంలోకి దింపారు. సదరు స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకొని తమకు మద్దతు తెలిపేలా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు అభ్యర్థులు ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతుగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహాకూటమి, టిఆర్‌ఎస్, బిజెపి, బిఎల్‌ఎఫ్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరికి వారు ఓటర్లను, నామినేషన్ వేసిన అభ్యర్థులను తమవైపు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందుకోసం కొంతమంది తమ రాష్టస్థ్రాయి నేతలను కూడా రంగంలోకి దింపారు. ఎవరికి వారు తమ ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎక్కువ మంది నేతలను తమవైపుకు తిప్పుకోవడం ద్వారా ప్రజల్లో బలాన్ని పెంచుకొని వాటిని ఓట్లుగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఆయా ప్రధాన పార్టీల్లో అభ్యర్థులుగా పోటీచేసిన వారిని వ్యతిరేకిస్తూ ఆయా పార్టీలకు రాజీనామాలు చేసిన వారిని ఇతరులు బుజ్జగించి తమవైపుకు తిప్పుకోవడం ఆయా ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. మరికొన్ని చోట్ల పార్టీల్లో చేరికలు అభ్యంతరకరంగా కూడా ఉంటున్నాయి. ఎన్నికలకు కేవలం 15రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది నేతలు తమ పార్టీల్లోకి రాకున్నా వచ్చారని ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీలోని శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నారు. కాగా ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వెంట ఉన్న నేతలను ప్రత్యర్థుల చేతికి చిక్కకుండా నిత్యం తమ నమ్మకస్తుల కనుసన్నల్లోనే ప్రచారాలు నిర్వహిస్తుండటం గమనార్హం.

బాబుపై విమర్శలు కేసీఆర్ దిగజారుడుతనం
* ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాకూటమి లక్ష్యం
* సోనియా ప్రసాదించిన తెలంగాణాను కాపాడుకుంటాం
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమకుమార్, ఖమ్మం అభ్యర్థి నామా
ఖమ్మం(మామిళ్ళగూడెం), నవంబర్ 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుపై ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అసభ్య పదజాలాలతో విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, ఖమ్మం నియోజకవర్గ ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరావులు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి అంచున కొట్టుమిట్టాడటం వల్లనే చౌకబారు విమర్శలకు పాల్పడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధి ప్రసాదించిన తెలంగాణను కెసిఆర్ కుటుంబ బారి నుండి కాపాడుకుంటామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10నియోజకవర్గాలల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయాలను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పాలన విధానాలవల్లనే తెలంగాణకు ఆదాయ వనరులు సమకూరాయని వాటిని దుర్వినియోగపరుస్తూ ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాలను కొల్లగొడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని కెసిఆర్ పదే పదే చంద్రబాబుపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు తెలంగాణను ఇవ్వాలని కేంద్రానికి లేఖ ఇచ్చాడే తప్ప ప్రాజెక్టులకు అడ్డుపడుతూ లేఖ ఇవ్వలేదన్నారు. నాలుగున్నరేళ్ళ టిఆర్‌ఎస్ పాలనలో 8వేల పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. విద్యుత్ గ్రిడ్‌లు ఓపెన్ కావడం, సోలార్ ప్రాజెక్టులు రావడం వల్లనే తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా విద్యుత్ కొరత లేకుండా పోయిందని ఈ విషయంలో కేసిఆర్ సాధించిందేమి లేదన్నారు. రీ డిజైనింగ్ పేరుతో ప్రాణహిత, చేవెళ్ళ పేర్లు మార్చి 36లక్షలతో పూర్తయ్యే ప్రాజెక్టులను లక్ష్యకోట్ల రూపాయల అంచనాలకు పెంచి నిధులు దిర్వినయోగానికి పాల్పడ్డారన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలు నామాను తలచుకోవడం తట్టుకోలేకనే ఆదివారం ఖమ్మంలో జరిగిన సభలో కెసిఆర్ నామా జపం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రజలు ప్రజాకూటమికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సంధ్యారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుల్తాన్, వడ్డెబోయిన నరసింహారావు, పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, సోమ్లా నాయక్, తాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.