ఖమ్మం

బక్కరైతు బిక్కమొఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, మే 19: ఎన్నో ఏళ్ల నుంచి రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది. అయితే మండలంలోని పాపకొల్లు రెవిన్యూ పరిధిలోని పాపకొల్లు, వినోభానగర్, రాజారావుపేట, అన్నారుపాడు, కొత్తూరు, జడలచింత పలు గ్రామాలకు చెందిన రైతుల భూములకు పట్టాలు అందకపోవటం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజన్సీ చట్టాల ప్రకారం 1969కి ముందు నుంచి ఉన్న భూములకు కొద్దిమంది రైతులకు మాత్రమే 1బి పట్టాలున్నాయి. అప్పటి నుంచి రైతులు సాగు చేసుకుంటున్న భూములుకు ఎటువంటి ఆధారాలను రెవిన్యూ యంత్రాంగం చూపించలేక పోతోందనే ఆరోపణలున్నాయి. తమ భూములకు సర్వే నిర్వహించి హక్కు కల్పించాలని పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులను పాపకొల్లు రైతులు కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. భూములకు ఆధారాలు లేకపోవటంతో బ్యాంకుల నుంచి కనీసం వ్యవసాయ రుణాలను కూడా తీసుకోలేక పోతున్నామని రైతులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించినా కాగితాలకే పరిమితమైందని, అమలుకు నోచుకోలేదని రైతులు తెలుపుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనతో తమ భూ సమస్యలను తీరుతాయని ఆశించిన పాపకొల్లు రైతులకు నిరాశే మిగిలింది. ఇంతే కాకుండా సాగుకు పెట్టుబడి కోసం ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకానికి సైతం రైతులు దూరమయ్యారు. మండలంలో 5028 మంది రైతులకు 12,937 ఎకరాలకు మాత్రమే ఇ-పాస్ పుస్తకాలు మంజూరీ చేసిన అధికారులు ఈమేరకు రైతుబంధు చెక్కులను అందజేశారు. సర్వేకు నోచుకోని పాపకొల్లు రెవిన్యూ ప్రాంతంలో దాదాపు 2వేల ఎకరాల భూమి రెవిన్యూ రికార్డుల్లో లేకపోవటం గమనార్హం. గతంలో చేతిరాత పహణీలు ఇచ్చిన అధికారులు ప్రస్తుతం కంప్యూటరీకరణ తర్వాత అవి చెల్లుబాటులో లేకుండా పోయాయి. ఇదిలా ఉండగా కౌలు రైతులు, పోడు రైతులకు రైతుబంధు పథకం వర్తించకపోవటంతో బక్కరైతులు చేతిలో చిల్లిగవ్వలేకు సాగుకు పెట్టుబడి కోసం బిక్కమొఖం వేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాపకొల్లు ప్రాంతంలోని భూములకు రీసర్వే నిర్వహించి రైతాంగానికి పట్టాలు అందజేయాలని, రైతుబంధు పథకం కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

ఖమ్మం పార్లమెంటుతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ
* 31న రైతు సంఘాలతో రాష్టవ్య్రాప్త ఆందోళనలు
* కర్ణాటక వ్యవహారం పార్టీలకు గుణపాఠం కావాలి
* సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
ఖమ్మం(జమ్మిబండ), మే 19: వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఖమ్మం పార్లమెంటుతో పాటు మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక, సాధారణ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 119నియోజకవర్గాల్లో సిపిఐకి గణనీయమైన ఓట్లు ఉన్నాయని, సెక్యులర్, ప్రజాతంత్ర వాదులతో కలిసి మెజార్టీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నామన్నారు. త్వరలోనే నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికలకు సన్నద్దం చేస్తామన్నారు. రాష్ట్రంలో బిజెపి, టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులతో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
కర్ణాటకలో బిజెపి వ్యవహరిస్తున్న తీరు ఓ గుణపాఠం కావాలని, ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలియజేస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని ఆరోపించారు. జాతీయ స్థాయిలో వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ సర్కార్ మాటల్లో అభివృద్థి సాధిస్తుందన్నారు. రైతుబంధు ద్వారా వాస్తవ సాగుదారులందరికి పెట్టుబడి సాయాన్ని అందించాలని, అసైన్‌మెంట్ భూములు సాగుచేసుకునే రైతులను కూడా ఆదుకోవాలన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే మూడున్నర లక్షల ఎకరాల పోడుభూములు ఉన్నాయని, అయితే కేవలం 75వేల ఎకరాలకే పట్టాలిచ్చారని, మిగిలిన అందరికి పట్టాలిచ్చి రైతుబంధు పథకాన్ని అమలు చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆకాంక్షలతో పాటు అనేక మంది అమరుల త్యాగాలతో ఏర్పాటైందని, ప్రస్తుతం వారి ఆశయాలు నెరవేరడం లేదన్నారు. వచ్చే జూన్ 2న తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల దినోత్సవంగా సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. అలాగే 1వ తేదీన తెలంగాణ కళాకారుల, ఉద్యమకారుల ధూంధాంను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 31వ తేదీన రైతు సమస్యలపై ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు భారీగా నిరసన యాత్రలు చేపట్టనున్నామన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటైన టీమాస్ వల్ల ఉపయోగం లేదన్నారు. ఈ విషయాన్ని తాము గతంలోనే చెప్పామన్నారు. బిజెపి, టిఆర్‌ఎస్‌లాంటి పక్షాలను ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాతంత్ర, వామపక్షవాదులంతా ఒకే వేదికపైకి రావాలని, అందుకు సిపిఐ ప్రయత్నం చేస్తున్నదని వెల్లడించారు. తాము బిఎల్‌ఎఫ్‌లో చేరేది లేదని, అయితే తాము ఏర్పాటు చేసే వేదికలో సిపిఎం చేరుతుందని ఆశిస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి హేమంతరావు, రాష్ట్ర నాయకులు పోటు ప్రసాద్, నాయకులు జానీమియా, క్లైమెంట్, శింగ్ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.