ఖమ్మం

మాయ మాటలు నమ్మి పోసపోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మ(క్రైం), జూలై 23: తెలియని వ్యక్తులు చెప్పే మాయ మాటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్‌లో ప్రజలనుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదుటి వారిని ఆకట్టుకునే విధంగా మాటలు చెబుతూ బ్యాంకు ఖాతాలనుండి డబ్బులు కాజేసే సైబర్ నేరగాళ్ళ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ బ్యాంకు నుండైనా మీ సమాచారం కోసం ఫోన్లు చేయరనే విషయాన్ని ఖాతాదారులు ముందుగా గుర్తించాలని సూచించారు. నేలకొండపల్లికి చెందిన చెరుకూరి వీరబాబుకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మాట్లాడుతున్నానని మీకు వచ్చిన ఇన్సూరెన్క్ డబ్బు మీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తామని నమ్మించి ఎటిఎం కార్డు నెంబర్ తీసుకున్నాడని చెప్పాడు ఆ ఖాతాలో డబ్బులేకపోవడంతో మరో నెంబర్ ఇవ్వమని అడగడంతో సమీప బందువుల ఎటిఎం నెంబర్ తీసుకొని ఓటిపి నెంబర్ చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి ఖాతాలోని 32వేల రూపాయలను కాజేశారన్నారు. కొద్ది సేపటి తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు కొండపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. తన భర్త ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడని, ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి ప్రవేయం లేకపోయినప్పటికి కొంతమంది వచ్చి తమవద్ద తీసుకున్న అప్పు చెల్లించాలని దౌర్జన్యం చేస్తున్నారని తనకు ఈ విషయంలో న్యాయం చేయాలని హోంగార్డు బార్య విన్నవించారు. బ్యాంకు ఖాతాదారులు, ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ట ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యల పరిష్కారం కోరుతూ సిపికి విన్నవించారు.