ఖమ్మం

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 23: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న వేడుకల్లో రాష్ట్ర రోడ్డు భవనాలశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరావు ముఖ్యఅతిధిగా పాల్గొంటారన్నారు. పలు శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సహజత్వం ప్రతిబింబించే విధంగా శకటాలను రూపొందించాలన్నారు. జాతీయ సమైఖ్యతకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రగతి నివేదికను ఆగస్టు 1వ తేదీనాటికి జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయానికి పంపాలన్నారు. ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేసేందుకు ఆయా శాఖల అధికారులు ప్రతి శాఖ నుండి ఒకరిని ఎంపికచేసి ఆగస్టు 5వ తేదినాటికి కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలన్నారు. పోలీస్ పరేడు గ్రౌండ్‌లో తాగునీటి వసతులను ఏర్పాటుచేయాలని మున్సిపల్ శాఖాధికారులను ఆదేశించారు. ప్రజలందరికి ఉచితంగా కంటి పరీక్షలను నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాలకు సంబందించిన ఏర్పాట్లను ముందస్తుగా సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సందీప్‌కుమార్ ఝా, కలెక్టరేట్ ఏవో మదన్‌గోపాల్, డిఆర్‌డిఎ పిడి బెల్లం ఇందుమతి, డిఇవో మదన్‌మోహన్, ఖమ్మం ఆర్డీవో పూర్ణచంద్ర, డిపివో శ్రీనివాసరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కొండల్‌రావు, డిపిఆర్‌వో ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మంలో ఇఎస్‌ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలి
ఖమ్మం(గాంధీచౌక్), జూలై 23: ఖమ్మం జిల్లా కేంద్రంగా ఇఎస్‌ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి విష్ణువర్ధన్, ఏరియా ప్రధాన కార్యదర్శి సిహెచ్ విప్లవ్‌కుమార్, ఐఎన్‌టియుసి నగర అధ్యక్షుడు యండివై పాషాలు డిమాండ్ చేశారు. ఇఎస్‌ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జెఎసి ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, ప్రతి నెల వారి వేతనం నుండి ఇఎస్‌ఐ వాటా కింద కటింగ్ అవుతుందన్నారు. కాని జిల్లాలో ఇఎస్‌ఐ హాస్పిటల్ లేకపోవటం వల్ల కార్మికులు అత్యవసరమైన వైద్యం కోసం హైదరాబాద్ వరకు వెళ్ళలేక ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. దీంతో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే జిల్లా కేంద్రంగా ఇఎస్‌ఐ హాస్పిటల్‌ను ఏర్పాటు చేయాలని లేకుంటే కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జెఎసి నాయకులు తాళ్లపల్లి రాములు, నారాయణ, దున్న గురవయ్య, జినక శ్రీను, ప్రసాద్, పద్మ, జయరాజు, క్రిష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.