క్రైమ్/లీగల్

ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, సెప్టెంబర్ 5: మండల పరిధిలోని ఆర్.కొత్తగూడెం గ్రామ శివారులో కుర్నపల్లి రహదారిలో వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను మంగళవారం సాయంత్రం అరెస్టు చేసినట్లు చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజువర్మ తెలిపారు. ఈ మేరకు పత్రికలకు వారు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రోజు మాదిరిగానే కుర్నపల్లి వెళ్లే రహదారిలో చర్ల పోలీసులు, 141 బెటాలియన్ సీఆర్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో కుర్నపల్లికి చెందిన కుంజా రాజబాబు, విజయకాలనీకి చెందిన పలకా రమేష్ అనుమానాస్పదంగా కనిపించగా ఇద్దరిని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించామన్నారు. వారు మావోయిస్టు సానుభూతిపరులుగా పని చేస్తున్న ఒప్పుకున్నారని తెలిపారు. వారివద్ద నుంచి పెద్దమొత్తంలో మెడికల్ కిట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. భద్రాచలం ఏఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్ ఆదేశాల మేరకు వారిని అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.

నీటితొట్టిలో పడి బాలుడు మృతి
చింతకాని, సెప్టెంబర్ 5: నీటితొట్టిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నారపోగు శ్రీనివాసరావు, జ్యోతిల చిన్న కుమారుడై నారపోగు అభిరామ్(3) ఆడుకుంటు ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టిలో పడి మృతిచెందాడు. ఇంటిలో ఉన్న తల్లి చిన్నారి కోసం వెతుకుతుండగానే ఘోరం జరిగిపోవడంతో తల్లిదండ్రులు భోరునవిలపించారు. కళ్లముందు ఆడుకుంటు అంతలోనే కనుమరగైనాడని వారు విలపిస్తున్న తీరు గ్రామస్తులను సైతం కంటతడి పెట్టించింది.