క్రైమ్/లీగల్

సాగర్ కాల్వలో దూకి వ్యక్తి గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 20: ఓ వ్యక్తి కాల్వలో దూకి గల్లంతైన సంఘటన గురువారం మండలంలోని గొల్లగూడెం వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం హైద్రాబాద్‌లో నివాసం ఉంటున్న చిరుమర్రి వెంకటనాగశివరామకృష్ణ దీక్షిత్(34) 2015లో మండలంలోని ఓ వెంచర్‌లో ఇల్లు కొనుక్కున్నాడు. గురువారం ఆ ఇంటిని చూసేందుకు రెండవ భార్య రజనీరెడ్డితో కలిసి సదరు వెంచర్‌కు వెళ్ళాడు. ఆ వెంచర్‌లోని ఇంటిలో సుతారి కార్మికులు నివాసం ఉండడంతో వారితో వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో మనస్తాపం చెందిన తన భర్త సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కాగా కాల్వలో దూకి గల్లంతైన దీక్షిత్ కోసం గజ ఈతగాళ్లతో గాలింపులు చర్యలు కొనసాగిస్తున్నట్టు ఎస్‌ఐ రాము తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాల్వలో దూకిన తన భర్తను కాపాడాలని ఎవరిని కోరినా ముందుకు రాలేదని బాధితురాలు రజనీరెడ్డి వాపోయింది.

డెంగ్యూతో ఇద్దరు చిన్నారుల మృతి
కొత్తగూడెం రూరల్, సెప్టెంబర్ 20: డెంగ్యూజ్వరంతో బాధపడుతూ ఇద్దరు చిన్నారులు మృతిచెందిన సంఘటన చుంచుపల్లి మండలంలో గురువారం జరిగింది. చుంచుపల్లి మండల పరిధిలోని రాంనగర్‌కాలనీకి చెందిన రేణికుంట్ల మోక్ష (5), వెంకటేశ్వరకాలనీకి చెందిన అబ్ధుల్ రహీం (8)లు గత మూడురోజులుగా డెంగ్యూ జ్వరంతో చికిత్స పొందుతున్నారు. రక్తకణాలు రోజురోజుకు పడిపోవడంతో పరిస్థితి విషమించి చిన్నారులు ఇరువురు మృతిచెందారు. మృతదేహాల వద్ద కుటుంబసభ్యులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గ్రామాలలో హెల్త్‌క్యాంప్‌లు ఏర్పాటుచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నప్పటికి చర్యలు చేపట్టకపోవడం మూలంగా అభంశుభం ఎరగని చిన్నారులు మృత్యువాత పడ్డారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు స్పందించి హెల్త్‌క్యాంప్‌లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.