ఖమ్మం

ముందస్తు ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక రూపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 20: ముందస్తు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. గురువారం స్థానిక పోలీస్ కార్యంపు కార్యాలయంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పోలీస్‌స్టేషన్ పరిధిలో గల పోలింగ్ కేంద్రాలను ముందుగా గుర్తించి జాబితాను సమర్పించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజలు ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పోలీస్ అధికారులు ముందుగానే సందర్శించి అవసరమైన ఏర్పాట్లను గుర్తించాలన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తరువాత రాజకీయ పార్టీలు నిర్వహించే సభలను ముందస్తుగానే అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. అందుకోసం ప్రత్యేకంగా సువిధ ఆన్‌లైన్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో ఎంపి-3 ఇవిఎంలను వినియోగించనున్నామని, అవి ఎటువంటి ట్యాంపరింగ్‌కు ఆస్కారం కలిగి ఉండవన్నారు. నూతన ఇవిఎంలు జిల్లాకు వచ్చిన తరువాత అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో మొదటి లెవల్ తనిఖీ నిర్వహిస్తామన్నారు. ఇవిఎంలపై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించేందుకు పోలీస్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ మాట్లాడుతూ రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా జిల్లాలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణకై ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ ధన, బల, మద్యపానంను పూర్తిగా నిర్మూలించేందుకు సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి తమ పరిధిలో పోలింగ్ కేంద్రాన్ని తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ఎన్నికల్లో పోలీస్‌శాఖ పాత్రపై సబ్ కలెక్టర్ అనురాజ్ జయంతి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ మురళీధర్‌రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కేసిఆర్ సీటు ఇచ్చారు
* తుమ్మల, జలగం అండగా ఉన్నారు
వేంసూరు, సెప్టెంబర్ 20: తనపై ఉన్న నమ్మకంతో కేసిఆర్ అసెంబ్లీ సీటు ఇచ్చారని, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు ఆశీస్సులతో ప్రచారానికి వచ్చిన తనకు తమ దీవెనలు అందజేయాలని ఓటర్లను సత్తుపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి పిడమర్తి రవి కోరారు. గురువారం మర్లపాడులోని షిర్డీసాయి బాబా దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని కేజి మల్లేల, శంభునిగూడెం గ్రామాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ కుటుంబ సభ్యునిగా ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తనకు మీ దీవెలను అందించాల్సిందిగా కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తాను కనబర్చిన ఉద్యమ స్ఫూర్తిని గుర్తించిన సిఎం కేసిఆర్ సత్తుపల్లి సీటు ఇచ్చి ప్రోత్సహించారని, ఓటమి చెందినప్పటికీ సత్తుపల్లినే కేంద్రంగా చేసుకొని నియోజకవర్గ ప్రజలతో కలసి ఉండటంతో తిరిగి మరోమారు పోటి చేసే అవకాశం కల్పించినందుకు కేసీఆర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధికి 12వందల కోట్లు విడుదల చేయించటం జరిగిందన్నారు. మహాకూటమి పేరుతో సిద్ధం అవుతున్న వారికి సిద్ధాంతాలు లేవని విమర్శించారు. ఏ ఉద్దేశంతో తెలంగాణ సాధించుకున్నామో ఆ దిశగానే అభివృద్ధి జరుగుతుంటే, రాజకీయ విపక్షాలకు మనుగడ ఉండదని గ్రహించి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని వస్తున్నారని వారికి తగన బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపి జగన్నాధం, జెడ్పీటీసి భాష, జగన్మోహనరావు, పెయ్యల యాకోబు, వేణుగోపాలరెడ్డి, నల్లమోతు ప్రసాదు, పొట్రు ప్రసాదు, గడిపర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

డిఎంఅండ్‌హెచ్‌ఓగా కళావతిబాయి
ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 20: జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా బాణోత్ కళావతిబాయి గురువారం భాద్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన డాక్టర్ కొండల్‌రావు జిల్లా శిక్షణ విభాగం ప్రోగ్రాం అధికారిగా నియమితులయ్యారు. సూర్యాపేట జిల్లాలో పనిచేసిన కళావతిబాయి ఇక్కడకి బదిలీపై వచ్చారు. గతంలో జిల్లాలో ఎన్‌హెచ్ విభాగంతలో డిసిఎంఓగా పనిచేసి పదోన్నతిపై సూర్యాపేట డిఎంఅండ్‌హెచ్‌ఓగా వెళ్ళారు. నూతన బాధ్యతలు తీసుకున్న కళావతిబాయిని డాక్టర్ కొండల్‌రావుతో పాటు అధికారులు, సిబ్బంది పూలమాలలతో అభినందించారు.