ఖమ్మం

ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ప్రభుత్వాన్ని సాగనంపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 20: ఆత్మగౌరవం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే అందులో ఏర్పడ్డ తొలిప్రభుత్వం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, దానిని సాగనంపేంత వరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా గురువారం మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంలోయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో భట్టివిక్రమార్క మాట్లాడుతూ పోరాటాలు చేసి ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఉద్యోగాలు అడిగిన పాపానికి ఉస్మానియా విద్యార్థులను బంధించారని పేర్కొన్నారు. ఉద్యోగులకు కల్పిస్తానన్న వౌలిక సదుపాయాలు కల్పించకపోగా వారికి రావాల్సిన హక్కులను కాలరాసేలా ప్రయత్నించారన్నారు. ఈ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ప్రతి ఒక్కరూ సైనికులుగా కదలాలన్నారు. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించాలని అడిగిన రైతులకు సంకెళ్ళు వేసి బజారులో నడిపించారన్నారు. మాటల గారడితో అనేక హామీలనిచ్చి నేడు వాటిని పూర్తిచేయకపోగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామని చెప్పడం టిఆర్‌ఎస్ పార్టీకే చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హరించేలా పాలించిన కెసిఆర్‌కు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దరికి చేరలేదని, కేవలం ఆ పార్టీ కార్యకర్తలకే అందాయని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను కూడా చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దానిపై ప్రశ్నించేవారిని నిర్భందించారని, ప్రశ్నించే హక్కు లాగేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాయమాటలతో పాలించిన కెసిఆర్‌ను దేశంలో మోడీని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, కేవలం మాటలు తప్ప చేతలు లేని ఆ నేతలను తరిమికొట్టేందుకు సన్నద్దమవుతున్నారని పేర్కొన్నారు. ఆత్మగౌరవ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన అనూహ్యమైనదన్నారు. కాంగ్రెస్ పాలనలోనే సంక్షేమ పథకాలు అమలయ్యాయని చెబుతున్నారని, ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తమనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు భట్టికి హారతులిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సుధాకర్‌రెడ్డి, దేవేందర్, నర్సింహారావు, శ్రీనివాస్‌రెడ్డి, దుర్గాప్రసాద్, పురుషోత్తం, కృష్ణారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌కు చేరుతున్న తెల్లబంగారం
* కొత్త పత్తికి క్వింటాకు 5,112 ధర
* మొదటి పంటను కొనుగోలు చేసేందుకు పోటిపడిన వ్యాపారులు
ఖమ్మం(గాంధీచౌక్), సెప్టెంబర్ 20: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోళ్ళు లేక వెలవెలపోతున్న మార్కెట్ ప్రస్తుతం మార్కెట్‌లోకి కొత్త పత్తి పంట వచ్చి చేరుతుడటంతో మార్కెట్ కొంత కళకళలాడుతుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 4నెలలు కావటంతో వచ్చే నెల నుండి కొత్త పత్తి పంట మార్కెట్‌కు వస్తుందని మార్కెట్‌శాఖ అధికారులు, వ్యాపారులు అంచనాలు వేసుకున్నారు. కాగా గురువారం వి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన బి రమేష్ అనే రైతు తాను పండించిన పత్తి పంట కొతకు రావటంతో పత్తిని అమ్ముకునేందుకు ఖమ్మం మార్కెట్‌కు తరలించాడు. రైతు తరలించిన 5బస్తాల పత్తి పంటకు క్వింటాకు 5,112రూపాయల ధర పలకటంతో రైతు సంతోషాన్ని వ్యక్తం చేశాడు. రానున్న నెలలో పత్తి పంట మార్కెట్‌కు వస్తుందని అంచనాలు వేసుకున్న మార్కెట్‌శాఖ అధికారులు ఆ దిశగా పత్తి పంటను ఈనామ్ విధానంతో కొనుగోలు చేసే విధంగా అన్ని చర్యలు చేపట్టారు. కాగా వెంకటాయపాలెంకు చెందిన రైతు తన పంటను తరలించటంతో ఈ సీజన్‌లో కొత్త పత్తి పంట ఖమ్మం మార్కెట్‌కు రావటం ఇదే ప్రధమం కావటంతో కొంత ఆశక్తికరంగా మారింది. కొత్త పత్తిని కొనుగోలు చేసేందుకు మార్కెట్‌లో వ్యాపారులు పోటి పడాటం విశేషం. కొత్త పత్తి పంటను మొదటి సారిగా ఇస్లావత్ రఘురాం కమిషన్ మర్చంట్ ఆధ్వర్యంలో శ్రీమణికంఠ కాటన్ ట్రేడర్స్ ఖరీదు చేశారు. దీంతో రైతు తన పంటకు మంచి ధర రావటం అనందదాయకమని రానున్న రోజుల్లో కూడా ఇదే ధర వస్తే రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేయటం విశేషం.

అన్నదానం ప్రారంభించిన పీఓ
భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 20: భద్రాచలం పాత ఎల్‌ఐసీ ఆఫీస్ రోడ్డులో గణేష్ మండపం వద్ద గురువారం అన్నదాన కార్యక్రమాన్ని ఐటీడీఏ పీఓ పమేలా సత్పతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గణనాథుడిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ నవరాత్రి వేడుకల్లో భాగంగా మండపాల వద్ద అన్నసంతర్పణ నిర్వహించడం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వీకరించడం వల్ల సర్వవిఘ్నాలు తొలగిపోయి ప్రజలు సుఖశాంతులతో ఉంటారన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.