ఖమ్మం

ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నేరాల నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 20: ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు ద్వారా నేరాలను సులభంగా నియంత్రించవచ్చని ఎస్పీ సునీల్‌దత్ అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా డిజె, బాణసంచాకు అనుమతిలేదని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరిస్తూ మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అధికారులు తమతమ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పోలింగ్ స్టేషన్లను ఎప్పటికప్పుడు సందర్శించాలని సూచించారు. ఎన్నికల నేపధ్యంలో సమస్యలు సృష్టించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి వారి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. పోలిస్‌స్టేషన్ పరిసరాల్లో మొక్కలను నాటి వాటిని పరిరక్షిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పర్చుకోవాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తిచేయడంలో కోర్టు అధికారులతో సమన్వయం పాటిస్తూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. గుట్కా, మట్కా, పేకాట, గ్యాంబిలింగ్‌లపై దాడులను ముమ్మరం చేయాలన్నారు. నేనుసైతం కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతిప్రాంతంలో సిసి కెమెరాలు ఏర్పాటుచేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. వాహన తనిఖీలను ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ నియామకాలపై ప్రజలకు అవగాహన కలిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. చిన్నపిల్లలు, అడవారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన శిక్షలు పడేలా కేసులు నమోదు చేయాలని తెలిపారు. నేర నియంత్రణ కొరకు ప్రతి సమాచారాన్ని టిఎస్‌ఇఓకు అప్లికేషన్‌లో నిక్షిప్తం చేసే విధంగా అధికారులు, సిబ్బంది నైపుణ్యత సాధించాలని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై సస్పెక్ట్‌షీట్స్, రౌడీషీట్స్ తెరవాలని ఆదేశించారు. ఏజెన్సీ పోలిస్‌స్టేషన్లలో భద్రత ఏర్పాట్లను పటిష్టంగా చూసుకోవాలని, మావోయిస్టు కదలికలపై నిఘా పెంచాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫణికుమార్, భద్రాచలం ఎఎస్పీ సంగ్రామ్‌సింగ్‌పాటిల్, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు డిఎస్పీలు ఎస్‌ఎం అలీ, శ్రీనివాసులు, సాయిబాబా, ఎస్‌బి ఇన్స్‌ఫెక్టర్లు సుబ్బారావు, రవి, ఐటిసెల్ సిఐ రాజ్‌గోపాల్, సిఐలు ఆదినారాయణ, గోపి, కుమారస్వామి, వేణుచందర్, కొండ్రు శ్రీను, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, అశోక్, ప్రవీణ్, అబ్బయ్య, కరుణాకర్, ఆర్‌ఐలు సిహెచ్‌వి కృష్ణ, సోములు, కామరాజు, ఐటిసెల్ సిబ్బంది పాల్గొన్నారు.

పొత్తులైనా వైరా కాంగ్రెస్ సీటును వదులుకోం
* నాయకుల్లో మరింత పెరుగుతున్న పట్టుదల
జూలూరుపాడు, సెప్టెంబర్ 20: ముందస్తు ఎన్నికలతో రాజకీయాలు వేడెక్కిన సంగతిని పక్కనబెడితే ఆయా పార్టీల్లో టిక్కెట్ల కోసం పోటీపడే ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిఆర్‌ఎస్ పార్టీ ముందుగానే మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ను అభ్యర్థిగా ప్రకటించగా ఆయన అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోని మరో వర్గం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులు నియోజకవర్గ వ్యాప్తంగా బహిరంగంగానే అభ్యర్థిని మార్చాలని సమావేశాలు నిర్వహించారు. నాలుగన్నరేళ్ల కాలంలో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ సమావేశాల ద్వారా కార్యకర్తల నిర్ణయాన్ని కూడా పార్టీ అధినాయకునికి వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ విధానాలు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పార్టీ అభ్యర్థికి కొంత ఇబ్బందికరంగా మారాయని సీనియర్ రాజకీయ నాయకులు కొందరు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో మరో విచిత్ర రాజకీయ పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో మెజార్టీ ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీ పొత్తుల కారణంగా వైరా నియోజక వర్గ సీటును వదులుకున్న కారణంగానే విజయాన్ని చేజార్చుకోవాల్సి వచ్చిందని నాయకులు వాపోతున్నారు. అయినా గత ఐదేళ్లుగా ఎస్టీ నియోజకవర్గమైన వైరాలో అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కొందరు నేతలు పర్యటిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులను కలుసుకుంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీని ఢీకొనాలంటే మహాకూటమితోనే సాధ్యమని కాంగ్రెస్ అధిష్ఠానం తలపోస్తుండటంతో మరోసారి అన్యాయం జరుగుతుందా అనే సంశయంలో నాయకులు ఊగిసలాడుతున్నారు. అయితే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న టిక్కెట్ ఆశావహులైన లావుడ్యా రాములునాయక్, లకావతు గిరిబాబులు మాత్రం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆపార్టీ సీనియర్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిరువురు ఆ పార్టీ అధిష్ఠానానికి కూడా నియోజకవర్గ పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో కాంగ్రెస్‌కు వైరా నియోజక వర్గాన్ని కేటాయించకుండా వేరే పార్టీకి అప్పగిస్తే కాంగ్రెస్‌లో కూడా నియోజక వర్గ స్థాయిలో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు. పార్టీ కోసం కష్టపడటమే కాకుండా స్థానికంగా ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడే నాయకులనే అధిష్టానం గుర్తించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుల డిమాండ్ కూడా చర్చనీయాంశంగా మారింది. అవసరమైతే కాంగ్రెస్ తరపున స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగేందుకు సైతం పలువురు ఆశావహులు రాజకీయ పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అటు టిఆర్‌ఎస్‌లో వర్గపోరు, ఇటు కాంగ్రెస్‌లో పొత్తుల కసరత్తు ఆ పార్టీలకు ఎన్నికల పోరులో మరింత తలనొప్పిగా మారే ప్రమాదం ఉందని పలువురు వ్యక్తం చేస్తున్నారు.