రాష్ట్రీయం

కిడ్నాప్ చెరనుంచి తప్పించుకున్న తల్లీకూతుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, డిసెంబర్ 31 : తమ బంధువు అత్యక్రియలకు తిరిగి ఆటోలో ఇంటికి వస్తున్న తల్లి, కూతుళ్లను ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేయడంతో విషయం పసిగట్టి కిడ్నాప్ చెర నుంచి తప్పించుకున్న సంఘటన బుధవారం రాత్రి చిత్తూరు జిల్లా రేణిగుంటలో వారు గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేణిగుంట మండలం తారకరామా నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే హేమలత (42), తన బంధువు గుడియాత్తంలో మృతిచెందితే చూడడానికి తన కుమార్తె అభినయ్(18)తో కలిసి వెళ్లింది. అత్యక్రియలు ముగిసిన వెంటనే బయల్దేరి రాత్రి 12గంటలకు తిరుపతికి చేరుకున్నారు. అక్కడనుంచి ఇంటికి వెళ్లడానికి అక్కడ ఉన్న ఆటోలో మాట్లాడుకున్నారు. తమది కూడా ఆప్రాంతమేనని, అటువైపే వెళ్తున్నామని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో టీచర్ హేమలతతో మాటలు కలిపారు. ఈ సమయంలో ఆటోను దారిమళ్లించారు. విషయం గమనించిన హేమలత ఆటో డ్రైవర్‌ను ప్రశ్నించడంతో ఆరోడ్డు మరమ్మతులు చేస్తున్నారని చెప్తూ మరి కొంత దూరం పోగానే మరో మలుపు తిప్పి ముళ్లపొదల వైపు ఆటోను మళ్లించారు. ఆటో డ్రైవర్ దుర్బుద్ధి గ్రహించిన ఆమె భీతిల్లి ముందుగా ఆ చీకట్లో ఆటోలోనుంచి దూకింది. మరికొంత దూరం ఆటో పోగానే కుమార్తె ఉష అభినయ్ ఆటో నుంచి కిందికి దూకింది. తల్లీ కూతుళ్లిద్దరూ పరుగు పరుగున సమీపంలో ఎటిఎం సెంటర్‌కు వెళ్లారు.అక్కడ సెక్యూరిటీ గార్డు ఉండడంతో ఆటో డ్రైవర్లు పరారయ్యారు. ఆర్టీసీ బస్టాండులో తల్లీకూతుళ్లు ఆటో ఎక్కిన దగ్గరి నుండి ఆటో వెళ్లిన మార్గాల సిసి కెమెరాల పూటేజీలను పరిశీలిస్తున్నారు.