ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో పట్టుబడ్డ ప్రేమజంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి, తిరుమలలో వివాహం చేసుకునేందుకు వచ్చిన ఓ ప్రేమజంటను పోలీసులు పట్టుకున్నారు. ఓ యువతి కిడ్నాప్ అయిందంటూ వచ్చిన సమాచారం మేరకు గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులకు ఈ జంట చిక్కింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని, ఆమె ప్రియుడిని తిరుపతి పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఆ యువతి కిడ్నాప్ అయిందని, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె తిరుపతిలో ఉన్నట్టు ఖమ్మం జిల్లా పోలీసుల నుంచి ఇక్కడి పోలీసులకు సమాచారం అందింది. ఓ వాహనంలో వెళుతున్న ఆ యువతిని,యువకుడిని పట్టుకుని పోలీసులు విచారించగా వారి ప్రేమ వ్యవహారం బయటపడింది. మైనర్ కావడంతో యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.