హైదరాబాద్

వికలాంగుల జాబితాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: పాఠశాల స్థాయిలోనే కిడ్నీ వ్యాధి గురించి తెలియచేయాలని, ఈ విషయంలో సిఎం కెసిఆర్ దృఢ సంకల్పంతో వున్నారని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, సిఎంతో సంప్రదించి పూర్తి సహకారం అందిస్తామని, వారిని వికలాంగుల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బస్‌పాస్ సౌకర్యం, సంక్షేమ భవనానికి స్థలం కేటాయంచడానికి సిఎంతో సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. నగర మేయర్ బి.రామ్మోహన్ మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి పథకాలతోపాటు అన్ని ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడంలో ప్రయత్నిస్తామని అన్నారు. వ్యాధి లక్షణాలు ముందే తెలుసుకుని వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆసరా పథకం అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ స్థాయిలో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలో తన పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. కిడ్నీ పేషెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు స్వాగతం పలుకుతూ, వ్యాధి ఎప్పుడు ఎలా వస్తుందో చెప్పలేమని, ఆసుపత్రులలో ఎమర్జెన్సీ సౌకర్యం కల్పించాలని సూచించారు. డా. సిహెచ్.దేవికారాణి, ఇందిరాజైన్, బంధకవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.