ఆంధ్రప్రదేశ్‌

పార్టీ పదవులకు కిల్లీ దంపతులు రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం: కాంగ్రెస్ పార్టీ పదవులకు కిల్లీ కృపారాణి, కిల్లీ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేశారు. ఈ మేరకు వారు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తమ రాజీనామాలను పంపారు. కిల్లీ రామ్మోహన్‌రావు పీసీసీ కార్యదర్శిగా పనిచేస్తున్న విషయం విదితమే. వారు వైకాపా అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. ఈనెల 28న అమరావతిలో వైకాపాలో చేరుతున్నట్లు వారు వెల్లడించారు. జగన్ బీసీల సంక్షేమానికి చేపట్టబోయే కార్యక్రమాలు నచ్చి చేరుతున్నట్లు తెలిపారు. కాగా కిల్లీ కృపారాణి శ్రీకాకుళం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. తదనంతరం కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.