తెలంగాణ

తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యం: కేంద్ర మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తమ పార్టీ లక్ష్యం మున్నిపల్ ఎన్నికలు కాదన, 2023లో తెలంగాణలో అధికారంలోకి రావటమే ప్రధానమని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన సనత్ నగర్‌లో ఈసీఐఎస్‌లో రూ.150 కోట్లతో నిర్మించనున్న కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్‌ని తెలంగాణలో అమలు చేయాలని కోరారు. ఆరోగ్య శ్రీ మంచి పథకమైనప్పటికీ ఎందుకు ధర్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఏపీ రాజధాని మార్పుపై మాట్లాడుతూ ఇది కేంద్రం పరిధిలోనిది కాదని అన్నారు. అలాగే హైదరాబాద్‌ను రెండో రాజధాని చేసే విషయంలో వాస్తవం లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేకపోతే నిజామాబాద్‌లో కవిత ఎందుకు ఓడిపోతారని అన్నారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదనడం మంచి సంస్కృతి కాదని, కేటీఆర్‌ అహంకార వైఖరికి నిదర్శనమని కిషన్‌రెడ్డి మండిపడ్డారు.