రాష్ట్రీయం

మీరా మాకు నీతులు చెప్పేది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెసిఆర్ కుటుంబంపై కిషన్‌రెడ్డి నిప్పులు
కేంద్రానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 21: ఇళ్ల కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ఇళ్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన మేరకు కేటాయించడం జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నెపం నెడుతున్నారని ఆయన విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన శనివారం పార్టీ నాయకులు ప్రకాశ్‌రెడ్డి, మల్లారెడ్డి, రాములుతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. నోటికి ఏదీ వస్తే అది మాట్లాడుతున్నారని ఆయన పరోక్షంగా ఎంపి కవితనుద్దేశించి అన్నారు. ఈ నెల 18న కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు గృహాలు కేటాయించిందని ఆయన తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణానికి లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్రం చెప్పిందని అన్నారు. అయితే 18న సమీక్ష ఉన్నప్పటికీ, సకాలంలో ప్రతిపాదనలు పంపించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. చివరకు 17వ తేదీ సాయంత్రం ప్రతిపాదనలు పంపించిందని ఆయన తెలిపారు. అప్పటికే సమావేశం అజెండా సిద్ధమైందని, అయినప్పటికీ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు అజెండాలో చేర్చి, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు 10,290 ఇళ్లకు నిధుల కేటాయింపు చేసేందుకు సమావేశం ఆమోదించేలా చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. ఇంత చేసినా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కేంద్రం వివక్ష చూపిస్తున్నదని విమర్శించడం భావ్యమా? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం వివక్ష, విషపూరితమైందని ఆయన విమర్శించారు. టిఆర్‌ఎస్‌లో చేరితేనే నిధులు విడుదల చేస్తామని ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను భయపెడుతున్నారని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్‌లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు భారీగా నిధులు విడుదల చేశారని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో గెలుపొందడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తున్నదని, టిడిపి-బిజెపిలకు, ఇతర ప్రతిపక్షాలకు బలంగా ఉన్న డివిజన్లను ఇష్టారాజ్యంగా మార్చేసిందని కిషన్ రెడ్డి విమర్శించారు.