బిజినెస్

కిచెన్ ఫర్నిషింగ్ రంగంలోకి గోద్రెజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: గోద్రేజ్ సంస్థ అధునాతన కిచెన్ ఫర్నిషింగ్ రంగంలోకి ప్రవేశించింది. ఆదివారం లైఫ్‌స్టైల్ మాడ్యులర్ కిచెన్ గ్యాలరీ బ్రాండ్ క్యుసిన్ రెగాల్‌ని ప్రారంభించింది. 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్‌లో ఓ స్టోర్‌ను ఏర్పాటు చేసింది. దీనిలో మూడు రకాల కిచెన్ ఫర్నిషింగ్ శ్రేణులని అందుబాటులో ఉంచింది. రాబోయే ఐదేళ్లలో ప్రీమి యం కిచెన్స్ మార్కెట్‌లో 15-20 శాతం వాటా చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు చెప్పారు. ప్రస్తుతం కిచెన్ ఫర్నిషింగ్ మార్కెట్ విలువ 1,100 కోట్ల రూపాయలుగా ఉంది. వచ్చే సంవత్సరానికి దేశవ్యాప్తంగా మరో 6 స్టోర్లు ప్రా రంభించాలని ప్రయత్నిస్తున్నామని, మరో రెండేళ్లలో 20 స్టోర్లకి విస్తరించాలని చూస్తున్నట్లు సంస్థ పేర్కొంది.