జాతీయ వార్తలు

కన్నయ్య విడుదల నేపథ్యంలో భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్‌కు దిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో అతను ఏ క్షణంలోనైనా విడుదలయ్యే అవకాశం ఉన్నందున పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్లీలోని జంతర్ మంతర్, జెఎన్‌యు, దిల్లీ యూనివర్సిటీ ప్రాంతాల్లో జరిగే ఆందోళనల్లో కన్నయ్య పాల్గొనే అవకాశం ఉందని పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను ముమ్మరం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పెంచాలని పోలీసుశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.