ఖమ్మం

తాలిపేరు 7 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల: అల్పపీడన ద్రోణి కారణంగా చర్ల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు గురువారం ప్రాజెక్టులో 7 గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రెండురోజులుగా చర్ల మండలంలో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది. అలాగే తాలిపేరు ఎగువున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. పరిస్థితి సమీక్షిస్తున్న అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టులో నీటిమట్టం 73.40 మీటర్లుగా ఉంది.