ఖమ్మం

వనంలో విరిసిన పూజా కుసుమం భక్త శబరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 15: ‘ ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి తింటివి వింతగాదె...’ అంటూ భక్తరామదాసు కొనియాడారు. శబరికి, రామునికి ఉన్న అనుబంధం అటువంటిది. వనంలో విరిసిన పూజా కుసుమం భక్తశబరి. శ్రీరామ తత్త్వాన్ని తెలిసిన తన గురువుల ఆజ్ఞపై పదమూడు సంవత్సరాలు శ్రీరాముని రాకకై ఎదురుచూస్తూ తపస్సు చేసింది భక్త శబరి. తన ఆశ్రమానికి విచ్చేసిన శ్రీరామ-లక్ష్మణులకు ఆతిధ్యమిచ్చిన ఒక సామాన్య గిరిజన వనిత శబరి. యోగులకు, మునులకు కూడా దుర్లభమైన ముక్తిని పొందింది. శ్రీరామానుగ్రహంతో తన పవిత్ర దేహాన్ని శ్రీరామగిరి ప్రాంతంలో ‘గోదావరి’కి ఉపనదియైన ‘శబరి’ నదిగా ప్రవహిస్తూ భద్రాచలం మన్యాన్ని పవిత్రం చేస్తోంది. సద్గురు సేవయే జీవన పరమావధిగా, శ్రీరాముని పరిచర్యతో కృతార్ధురాలైన శబరి ‘్ధర్మనిపుణ’. అందుకే ఆ మహాభక్తురాలి స్మృతిగా ఆశ్వయుజ పూర్ణిమ వేళ ఏటా శబరి స్మృతియాత్రను శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తోంది. ఏటా గిరిజన ప్రాంతాల నుంచి గిరిజనులను భద్రాచలం తీసుకొచ్చి వారి సమక్షంలోనే ఈ స్మృతి యాత్రను నిర్వహిస్తున్నారు. అపర భక్తురాలు శబరిని గుర్తు చేసుకుంటూ, కొనియాడుతూ సాగే ఈ యాత్రకు భక్తులు ఏటా అధిక సంఖ్యలో వస్తుంటారు.
సంప్రదాయాల పల్లకీలో...
గిరిజన సంప్రదాయాల పల్లకీలో శబరి స్మృతియాత్ర సాగుతుంది. అడవి నుంచి గిరిజనులు సేకరించి తెచ్చిన పూలు, పండ్లతో పాటుగా దేవస్థానం కూడా కొన్ని ఫలాలు, పుష్పాలు కలిపి శ్రీసీతారామచంద్రస్వామికి నైవేద్యంగా పెడతారు. అలనాడు శబరి మాత శ్రీరామచంద్రమూర్తికి తినిపించిన అడవి ఫలాలను కూడా సమర్పిస్తారు. శబరి ఎంగిలి పండ్లను శ్రీరామచంద్రునికి తినిపిస్తున్న చిత్రపటంతో గిరిజనులు తమ సంస్కృతి,సంప్రదాయాల మేళ,తాళాలు, తప్పెటలు వంటి వాయిద్యాలతో నృత్యాలు చేసుకుంటూ శోభాయాత్ర నిర్వహిస్తారు. అనంతరం గిరిజనులను కూర్చుండబెట్టి వారి సమక్షంలో శ్రీసీతారామచంద్రస్వామి నిత్యకల్యాణం చేస్తారు. వివిధ రకాల పండ్లు, పుష్పాలతో స్వామికి అర్చన చేసి మంత్ర పుష్పం సమర్పించి ప్రసాద వినియోగం చేస్తారు. ఉత్సవం ఆద్యంతం గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జరగడం విశేషం.