ఖమ్మం

ప్రతి ఇంటికి మంచినీరందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొణిజర్ల, నవంబర్ 29: రానున్న రెండేళ్ళలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీరు అందచేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రి మంగళవారం మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. పల్లిపాడు నుంచి జన్నారం వరకు ప్రస్తుతం ఉన్న అర్‌అండ్‌బి బిటి రోడ్డును 18 కోట్లవ్యయంతో డబల్ రోడ్డు మార్చే పనులకు, తీగలబంజర నుంచి మల్లుపల్లి వెళ్ళే రోడ్డు మధ్యలో ఉన్న రాళ్ళవాగుపై 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న వంతేన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా తనికెళ్ళ సమీపంలో 575 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తెలంగాణ తాగునీటి సరఫరా పథకం పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే బాణోత్ మదన్ లాల్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ తాగునీటి వలనే ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీరు అందించేందు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 50 వేల కోట్ల ఖర్చుతో రాష్ట్ర ప్రజలకు మంచినీరు అందచేయాలనే దృఢసంకల్పంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ప్రస్తుతం జిల్లా 1400 ఓవర్ హెడ్ ట్యాంక్‌లుండగా కొత్తగా మరో 1500 ట్యాంకులు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వైరాని పాలేరుతో సమానంగా అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. ఒక పంటకు సాగుకు ఇస్తామని, రైతుల ఇబ్బందుల దృష్ట్యా విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామన్నారు. నకిలి మిర్చి విత్తన రైతులను ఆదుకుంటామని విత్తన వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నియోజకవర్గ వెనుబడి ఉందని నియోజకవర్గంలో 114 కిమీ ఉన్న మట్టి రోడ్లను బిటి రోడ్లగా, మరో 100 కిమీ బిటి రోడ్లను డబల్ రోడ్లుగా మార్చటానికి నిధులు కేటాయించాలని కోరారు. దీనికి స్పందించిన మంత్రి నిధులు కేటాయించేందుకు అంగీకరిస్తున్న సభాముఖంగా హామీ ఇచ్చారు.

దీక్షాదివస్‌లో రగడ
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, నవంబర్ 29: సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రం కోసం ఇప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్ దీక్ష చేపట్టగా నాటి నుంచి నవంబర్ 29ని దీక్షాదివస్‌గా టిఆర్‌ఎస్ శ్రేణులు జరుపుకుంటున్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నగరంలో ఆర్‌అండ్‌బి అతిధి గృహం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్ కూడా వచ్చారు. ఇదే సమయంలో నాడు ఉద్యమంలో పాల్గొని ఇప్పటికీ పోలీస్ కేసులను ఎదుర్కొంటున్న కొంతమంది వెంటనే బేగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొనకుండా ఇప్పుడు ఆధిపత్యం చెలాయించడం ఏమిటంటూ ప్రశ్నించారు. ఈ సమయంలో బేగ్‌కు, జానీ అనే నేతకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఉద్యమంలో పాల్గొన్న కొందరు జానీకి మద్దతు పలకడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకొని వారించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకోకపోతే పెద్ద గొడవే జరిగేదని నేతలు పేర్కొన్నారు.

తమిళనాడు రాష్ట్రంలో సత్తుపల్లి ప్రాంతానికి చెందిన
ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి
* మరో ఇద్దరికి గాయాలు
* దుఃఖసాగరంలో తుంబూరుగ్రామం
సత్తుపల్లి, నవంబర్ 29:మండల పరిధిలోని తుంబూరు గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలై వెళ్ళి తిరుగు ప్రయాణంలో తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దర్శించుకొని, రామేశ్వరం వెళుతూ మార్గమధ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని తూత్‌కూడి జిల్లా పుడుక్కొట్టే గ్రామంలో మంగళవారం తెల్లవారుఝామున 3గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలోఇద్దరు భక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలం నుంచి ప్రత్యక్ష కథనం ప్రకారం ఈ నెల 24వ తేది సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామం నుంచి రెండు వాహనాల్లో 19మంది అయ్యప్ప భక్తులు శబరిమలై యాత్రకు వెళ్ళారు. సోమవారం తెల్లవారుఝామున అయ్యప్పకు యిరుముడులు సమర్పించి, సాయంత్రం త్రివేండ్రంలోని అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. అనంతరం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం గుడికి వెళుతూ మార్గమధ్యంలో వాహన వెనుక టైర్లు పేలిపోయి వాహనం డివైడర్‌ను డీకొనడంతోప్రమాదం జరిగినట్లు చెప్పారు.ఈ ఘటనలో తుంబూరు గ్రామానికి చెందిన మార్వతు కృష్ణ(41) అక్కడికక్కడే మృతి చెందగా, కూసంపూడి రవీంద్ర (44) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనే్నని రాంబాబు, నాగరాము స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతదేహాలను తూత్‌కుడి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించారు.పుడుకొట్టే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుఃఖసాగరంలో తుంబూరు గ్రామం
అయ్యప్ప భక్తులకు ప్రమాదం జరిగిందనే విషయం తెలియటంతో గ్రామంలో విషాధదచాయలు అలుముకున్నాయి. యాత్రకు వెళ్ళిన వారందరూ సమీప బంధువులు కావడంతో ఆ కుటుంబాలన్ని దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామం అంతా దుఃఖసాగరంగా మారింది.

వైభవంగా అయ్యప్పస్వామి పల్లివేట ఉత్సవం
మధిర, నవంబర్ 29: మధిర పట్టణంలోని లడక బజార్ అయ్యప్పనగర్‌లో వేంచేసియున్న శ్రీ అయ్యప్ప స్వామి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అయ్యప్ప స్వామి పల్లివేట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ నెల 23వ తేది నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అయ్యప్పస్వామి ఉత్సవ విగ్రహన్ని ప్రత్యేకంగా అలంకరించిన రధం పై ఉంచి అయ్యప్ప స్వాములు,్భక్తులు పురవీధుల్లో బాణాసంచాలు పేలుస్తూ, డప్పువాయిద్యాలు, కోలాట నృత్యాలతో స్వామి వారిని ఘనంగా ఊరేగించారు. మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైన ఊరేగింపు పట్టణంలోని అన్ని ప్రధాన వీధులలో రాత్రి వరకు కొనసాగింది. రాత్రి స్వామి వారు తిరిగి ఆలయంకు వద్దకు చేరుకున్న అనంతరం స్వామి వారి ఉత్సవ విగ్రహన్ని మండపంలో ఉంచి పల్లికురుప్ప(శయ్య) కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఊరేగింపు సందర్భంగా స్వామి వారి ఆలయం నుండి రైల్వేగేటు వరకు లడకబజార్‌కు చెందిన దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలోప్రధాన రహదారి ఇరువైపుల కొబ్బరి, మామిడి ఆకు తోరణాలతో అందంగా అలంకరించారు.ఈ సందర్బంగా మాలాదారులకు భక్తులకు చావా రవి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోగురుస్వాములు రాచకొండ వెంకటేశ్వరరావు, వంకాయలపాటి వెంకటనాగేశ్వరావు, బత్తుల శ్రీనివాసరావు, చెరుపల్లి శ్రీ్ధర్, తాళ్ళూరి అప్పారావు, వూట్ల వేణుబాబు, వంకాయలపాటి నాగేశ్వరావు, వల్లాపురి వెంకటేశ్వరరావు, ఏలూరి రామారావు, పాసికంటి గాంధీ, రామిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
స్వామి వారికి ఆరట్టు ఉత్సవం, అన్నదానం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం స్వామి ఆరట్టు (నదీస్నానం)నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఉదయం 9 గంటలకు ఆలయం వద్ద నుండి స్వామి వారి ఉత్సవ విగ్రహన్నివైరా నది వరకు ఊరేగింపుగా తీసుకువెళ్ళి నదీ స్నానం నిర్వహించి,నది తీరంలో విగ్రహనికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామి వారికి ఆభిషేకించిన పసుపు,కసంకుమలను మహిళల సౌభాగ్యం కొరకు అందజేయడం జరుగుతుందన్నారు.అనంతరం ఆలయం వద్ద అయ్యప్పలకు,్భక్తులకు మహ అన్నదానం నిర్వహించనున్నట్లు తెలిపారు,ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆలయ బాధ్యలు చలువాది ధర్మారావు, చలువాది శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావులు కోరారు.

మొద్దు నిద్రలో కెసిఆర్ ప్రభుత్వం
* టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క విమర్శ
వైరా, నవంబర్ 29: రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రలో జోగుతోందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్కా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా మంగళవారం మండల పరిధిలోని గన్నవరం గ్రామంలో రాత్రి ఆయన పల్లె నిద్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైరా పట్టణం నుండి గన్నవరం గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతోందని, ప్రజల సమస్యలు కెసిఆర్ గాలికొదిలేసారని ఆయన ఆరోపించారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని కుటుంబమంతా దొచుకుంటున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ కూడా కెసిఆర్ అమలుపర్చలేదన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో కెసిఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా వేశారని అన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ తన పాలన మార్చుకోకపోతే తాము ప్రజల వైపు నుండి పోరాడుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు ఐతం సత్యం, జిల్లా నాయకులు పూవాళ్ల దుర్గాప్రసాద్, రాములు నాయక్, మండల అధ్యక్షుడు పసుపులేటి మోహనరావు, శీలం నర్శిరెడ్డి పాల్గొన్నారు.

పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి
* డిఐజి రవివర్మ
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, నవంబర్ 29: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు పట్ల పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని వరంగల్ రేంజ్ డిఐజి సి రవివర్మ పోలీస్ సిబ్బందికి సూచించారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన డిఐజికి జిల్లా ఎస్పీ షానవాజ్‌ఖాసీం ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డిఐజి ఖమ్మం అర్బన్ పోలీస్‌స్టేషన్ క్రైం రికార్డులు, బాధితుల ఫిర్యాదులపై స్థానిక పోలీసులు తీసుకున్న చర్యలు, తదితర వివరాలను పరిశీలించారు. అదే విధంగా పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. శాంతి భద్రతలు కాపాడటంతో పాటు నేరస్తులను పట్టుకొని శిక్ష పడేలా చేయడం వంటి కీలక బాధ్యతలు పకడ్భందీగా నిర్వహించాలని, ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా ఫిర్యాదులను పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డిఎస్పీ కె సురేష్‌కుమార్, సిఐ నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు.
అమృత్‌సిటి శిక్షణా తరగతులకు ఖమ్మం ప్రతినిధులు
ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 29: రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన అమృత్‌సిటి పథకంపై హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పాపాలాల్‌తో పాటు డెప్యూటి మేయర్ బత్తుల మురళీప్రసాద్, కార్పొరేటర్లు ఎస్‌కె జాన్‌బీ, కొత్తపల్లి నీరజ, మేడ ప్రశాంతలక్ష్మి, గాజుల వసంత, కొప్పెర నర్సింహరెడ్డి తదితరులు హాజరైయారు. ఈ నెల 30వరకు నిర్వహించనున్న శిక్షణా తరగతుల్లో అర్బన్‌ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్‌మెంట్, ప్రజలకు ఎటువంటి వౌలిక సదుపాయాలు కల్పన, నిధులు ఖర్చు తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

కెసిఆర్ పోరాట ఫలితమే తెలంగాణ
ఖమ్మం(ఖిల్లా), నవంబర్ 29: టిఆర్‌ఎస్ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పోరాట ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన నిర్వహించిన ఉద్యమం చరిత్రాత్మకమని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం చేపట్టిన నిరహారదీక్షకు తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆనాడు కెసిఆర్ చికిత్స పొందిన గదిని సందర్శించి రోగులకు పండ్లు, పాలు పంచిపెట్టారు. టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కెసిఆర్ పోరాట ప్రతిమ మరువలేనిదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు సైతం పణంగా పెట్టారన్నారు. దీక్షా, పట్టుదలే తన ఆయుధంగా సాధించడంలో సిఎం సిద్ధహస్తుడన్నారు. తెలంగాణలో ప్రతి వ్యక్తి అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్‌బి బేగ్, ఏఎంసి అధ్యక్ష, ఉపాధ్యక్షులు జి కృష్ణ, మందడపు నర్సింహరావు, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, చావా నారాయణరావు, ఆసుపత్రి సూపరిండెంట్ మదన్‌సింగ్, వీరునాయక్, వినయ్‌కుమార్, సాగర్, సుబ్బారావు తదితరులున్నారు.

వైరాలో స్ర్తిశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన తుమ్మల
వైరా, నవంబర్ 29: రాష్టర్రోడ్లు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరావు స్ర్తిశక్తి కార్యాలయాన్ని ప్రారంభించారు. మంగళవారం స్థానిక ఎంపిడీఓ కార్యాలయ సమీపంలో రూ. 40లక్షల వ్యయంతో నిర్మించిన ఈభవనాన్ని గతఏడాది క్రితం తుమ్మల భూమిపూజ చేశారు. ఈకార్యక్రమానికి వచ్చిన తుమ్మలకు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు వేయి మోటారు సైకిళ్ళతో భారీ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. అంతుకుముందు వైరాలో టిఆర్‌ఎస్ పార్టీ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనుకున్న సమయానికి మంత్రి వైరాకు చేరుకుని కార్యకర్తల ర్యాలీలో పాల్గొని అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్, జడ్పి చైర్మన్ గడిపల్లి కవిత, జడ్పిటీసి బొర్రా ఉమాదేవి, ఎంపిపి బొంతు సమత, వైరా సర్పంచ్ బాణోతు వాలీ, వైరా సహకారపరపతి అధ్యక్షడు తాతా రంగారావు, జిల్లా టిఆర్‌ఎస్ నాయకులు మచ్చా వెంకటేశ్వరావు, మండేపుడి సత్యనారాయణ, జక్కంపుడి క్రిష్ణమూర్తి, నాయకులు ఇరుపార్శపు భాస్కర్, తన్నీరు నాగేశ్వరావు, కౌసర్, వేముల రత్నాకర్, శ్రీ్ధర్, దేవరాజ్, బోసు తదితరులు పాల్గొన్నారు.