ఖమ్మం

క్రమబద్ధీకరణ పట్టాల కోసం కోనేరు ప్రజాదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జనవరి 20: పారిశ్రామిక ప్రాంతమైన కొత్తగూడెం పట్టణంలో పెండింగ్‌లో ఉన్న 373 జివో ప్రకారం అర్హత కల్గిన వారందరికీ స్థలాల క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోనేరు సత్యనారాయణ (చిన్ని) శుక్రవారం స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ప్రజా దీక్ష నిర్వహించారు. గణేష్ టెంపుల్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వందలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ప్రజా దీక్ష కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఖమ్మం అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణ ప్రజలకు సంబంధించిన ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేసేంత వరకు నిర్వహించే పోరాటాల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్థలాల క్రమబద్ధీకరణను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పది సంవత్సరాలుగా స్థలాలు క్రమబద్ధీకరణ చేయకపోవటం వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థలాల క్రమబద్ధీకరణ ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సుమారు 12 వేల మంది ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే సగంమందికి పైగా పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కొత్తగూడెం మాజీ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెంలో పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు జిల్లా స్థాయి కమిటీ ఆమోదించిన పట్టాలను సైతం లబ్ధిదారులకు ఇవ్వటం లేదని తెలిపారు. సిపిఎం డివిజన్ కార్యదర్శి అన్నవరపు త్యనారాయణ, తెలుగుదేశం పార్టీ పినపాక నియోజకవర్గ ఇన్‌చార్జి కోలేటి భవానీ శంకర్, వైరా నియోజకవర్గ ఇన్‌చార్జి మాళోతు రాందాస్ నాయక్, భద్రాచలం ఇన్‌చార్జి కొమరం ఫణీశ్వరమ్మ, పాల్వంచ ఎంపిపి అరుణ, టిడిపి నాయకులు కోనేరు పూర్ణచందర్‌రావు, కంచర్ల గోపాలకృష్ణ, రావి రాంబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, తెలంగాణ జెఎసి నాయకులు మల్లెల రామనాధం, చెరుకు సుధాకర్, లంబాడీ హక్కుల పోరాట సమితి నాయకులు భూక్యా కోటయ్య, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు వాసం రామకృష్ణ, సనపా కోటేష్, సింగరేణి ఎస్సీ వెల్ఫేర్ ఆసోసియేషన్ నాయకులు ఆంతోటి నాగేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల నాయకులు పాల్గొన్నారు.