ఖమ్మం

మిర్చికి మద్దతు ధర కోసం ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), ఏప్రిల్ 4: రైతాంగం పండించిన మిర్చికి మద్దతు ధర ప్రకటించి తక్షణమే వారిని ఆదుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసి రాష్ట్ర సహయ కార్యదర్శి పోటు రంగారావు హెచ్చరించారు. మంగళవారం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిర్చి క్వింటాకు 15వేలు, అపరాలకు పదివేలు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పినట్లుగా పత్తికి బదులుగా రైతాంగం అపరాలతో పాటు మిర్చి సాగుచేశారన్నారు. పంట ప్రారంభంలో క్వింటా మిర్చి 12వేలు ఉన్న ధర 4వేలకు పడిపోయిందన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు రాకా రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కనీసం కోల్డ్‌స్టోరేజిలలో నిల్వ చేసుకునేందుకు కూడా అవకాశం లేకుండా వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ఆక్రమించారని దీంతో రైతు దిక్కుతోచన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందని దీన్ని విడనాడి రైతులను ఆదుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగం పండించిన పంటలకు మద్దతు ధర కల్పిచాలని దశలవారి ఆందోళనలు చేట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ నెల 5,6,7తేదిల్లో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, మలీదు నాగేశ్వరరావు, జి రామయ్య, గుర్రం అచ్చయ్య, శివలింగం, పుల్లయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.