ఖమ్మం

జిఎస్‌టి రద్దు కోరుతు వస్త్ర వ్యాపారుల బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), జూన్ 27: వచ్చే నెల 1నుండి ప్రభుత్వ విధిస్తున్న జిఎస్‌టిని రద్దు చేయాలని కోరుతూ వస్త్ర వ్యాపారులు మంగళవారం నుండి బంద్ నిర్వహిస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జిఎస్‌టిలో వస్త్రాలపై 18శాతం పన్ను విధించటంతో ఇప్పటికే ఉన్న 5శాతం పన్నును చెల్లించలేకపోతున్న తమపై మరింత భారం మోపారని వస్త్ర వ్యాపారుల సంఘం ప్రతినిధులు ఆరోపించారు. గత కొంత కాలంగా వివిధ రూపాలలో ఆందోళన చేస్తున్నప్పటికి ప్రభుత్వం స్పందించలేదని, అందుకే 4రోజుల పాటు నిరవధిక బంద్‌ను పాటిస్తున్నట్లు సంఘం నగర అధ్యక్షుడు కమర్తపు మురళి తెలిపారు. ప్రజలు నిత్యం ఉపయోగించే వస్త్రాలపై 18శాతం పన్ను విధించటం వల్ల ప్రజలపై మరింత భారం పడే అవకాశం ఉందని, తద్వారా వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే వివిధ రకాల పన్నులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై వస్త్రాల పన్ను విధించటం బాధకరమన్నారు. ఈ నెల చివరిలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
వస్త్ర వ్యాపారులు చేసిన ఆందోళనకు ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ తదితరులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రం వస్త్రాలపై విధించిన జిఎస్‌టిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజలు ఉపయోగించే వస్తువులపై పన్ను వేయటం సరైందికాదని పేర్కొన్నారు. వ్యాపారుల ఆందోళనకు మద్దతుగా ఉంటనని స్పష్టం చేశారు.

జిఎస్టీపై పోరుకు వస్త్ర వ్యాపారులు సన్నద్ధం
* బంద్ నిర్వహించి నిరసన తెలిపిన వ్యాపారులు
* వ్యాపారులకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు
కొత్తగూడెం, జూన్ 27: వస్త్ర వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం జిఎస్‌టిని ప్రయోగించటాన్ని నిరసిస్తూ వ్యాపారులు పోరాటాల బాట పట్టారు. మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని వస్త్రాల దుకాణాలను మూసివేశారు. క్లాత్ మర్చంట్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌కు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. మూడు రోజులపాటు వస్త్ర సంస్థల బంద్‌ను నిర్వహించేందుకు ఆసోసియేషన్ పిలుపునిచ్చింది. వస్త్ర సంస్థల మూసివేత కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో యూనిఫాంలు, డ్రస్‌లు వంటి ఇతర వస్త్రాలు కొనుగోలు చేసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వ్యాపారులకు సంఘీభావం తెలిపిన అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్‌టి పన్ను విధానం వలన వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే వస్త్ర వ్యాపారానికి జిఎస్‌టి బిల్లును మినహాయించాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై ఎటువంటి పన్నుల భారం పడకుండా పరిపాలిస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం పన్నుల భారం మోపుతుందని ఆరోపించారు. సిపిఐ జిల్లా నాయకులు మండే వీర హనుమంతరావు వ్యాపారుల బంద్‌కు మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు వ్యాపారస్థులు సైతం ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో క్లాత్ మర్చంట్ ఆసోసియేషన్ కార్యదర్శి మొరిశెట్టి భవానీ ప్రసాద్, ఆసోసియేషన్ నాయకులు బోగా శ్రీనివాస్, బోగా మురళి, బోగా రాజేంద్ర ప్రసాద్, మాడిశెట్టి శ్రీనివాస్, కొల్లా నర్శింహారావు, నరేంద్రుల సురేష్, మనోహర్, కనకయ్య, వివధ రాజకీయ పార్టీల నాయకులు ఎంఏ రజాక్, అన్వర్‌పాషా, తోట దేవీప్రసన్న, నరేందర్, సీతారాములు, బొందుగుల శ్రీ్ధర్, వై శ్రీనివాసరెడ్డి, చంద్రగిరి శ్రీనివాస్, బెజవాడ సత్యనారాయణ, మునిగడప వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.