ఖమ్మం

సగానికి పైగా ఖాళీలే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూన్ 27: గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ వ్యవస్థలో అన్ని ఖాళీలే ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో 44మండలాలు ఉండగా 24చోట్ల తహశీల్దార్‌లుగా ఇన్‌చార్జ్‌లే వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాల విభజన తరువాత ఎక్కువ మంది రెవెన్యూ అధికారులు ఖమ్మం జిల్లాలో ఉండేందుకే ఆశక్తి చూపటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీల సంఖ్య అధికంగా ఉంది. ఖమ్మం జిల్లాలో 5తహశీల్దార్లు, 2డిటిలు, 14సీనియర్ అసిస్టెంట్లు, 21విఆర్‌వోలు, 14ఎఎస్‌వోలు ఖాళీలు ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 19తహశీల్దార్లు, 11డిటిలు, 34సీనియర్ అసిస్టెంట్లు, 14జూనియర్ అసిస్టెంట్లు, 53విఆర్‌వోలు, 16ఎఎస్‌వోలు ఖాళీగా ఉన్నాయి.
ప్రధాన పోస్టులన్నీ ఇన్‌చార్జ్‌ల పాలనలో ఉండటంతో పనుల్లో వేగం తగ్గటమే కాకుండా ఉన్నవారిపైనే అదనపుభారం పడుతోంది. మండల కేంద్రంగా పనిచేసే రెవెన్యూ యంత్రాంగం 56రకాల ప్రభుత్వ పనులను చేయాల్సి ఉంటుంది. వీటికి తోడు కల్యాణలక్ష్మి, ఒంటరి మహిళ, గొర్రెల పంపిణీ, ఎన్నికల నిర్వహణ, ఓటర్ల నమోదు వంటి కార్యక్రమాలు కూడా అధనంగా చేయాల్సి వస్తున్నది. వీటిన్నటికి గ్రామ సభలు నిర్వహించాల్సిరావటం, ఆ సమయంలో ఇతర పనులు చేయాల్సి రావటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతవారణం వివరాలు, పంటల సాగు, వర్షపాతం, నీటి వనరుల వంటి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందించే ఎఎస్‌వోలు 3మండలాలకు ఒకరు చొప్పున పనిచేస్తున్నారు. వీరు కాకుండానే అనేక మంది ఆయా మండల కేంద్రాలలో ఉద్యోగం చేయాల్సి ఉండగా డిప్యూటేషన్ పేరుతో ఖమ్మం కేంద్రంలో పనిచేస్తున్నారు. కొంత మంది కలెక్టరేట్‌లోను, మరి కొంత మంది ఇతర కార్యాలయాల్లోను పనిచేస్తున్నారు. దీంతో ఆయా మండలాల్లోనే జీతం తీసుకునే వీరు అక్కడ పనిచేస్తున్నట్లుగానే ఉంటుంది. కాని వారి పని మాత్రం జిల్లా కేంద్రంలో ఉంటుంది. మరి కొంత మంది తాము ఇతర ప్రాంతాలలో కూడా పనిచేస్తున్నమనే సాకుతో ఎటు వెళ్ళకుండా పని తప్పించుకుంటున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

నత్తనడకన విచారణ
* ఎటూ తేలని ములవరుల చిత్రాల వ్యవహారం

భద్రాచలం టౌన్, జూన్ 27: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం గర్భగుడి నుంచి స్వర్ణకవచధారులైన మూలవరుల ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంపై విచారణ ఇంకా కొన సాగుతున్నట్లు తెలుస్తోంది. విచారణలో ఏం బయటపడిందనే దానిపై ఆలయ అధికారులు చెప్పడం లేదు. సోమవారం ఏడుగురు అర్చకులను విచారించిన విచారణ అధికారి భవానీ రామకృష్ణ ఎటువంటి సమాచారాన్ని వెల్లడించారు. పైగా మరోరోజు గడువు ఇవ్వాలని ఈవోను కోరారు. విచారణలో ఎందుకు జాప్యం చేస్తున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఫోన్‌లో ఫోటోలు తీశారు, ఆ ఫోటోలు ఎవరి ద్వారా ఎవరెవరికి వెళ్లాయనేది సాంకేతిక పరిజ్ఞానంతో తెలుసుకోవడం పెద్ద కష్టమైన పని కానప్పటికీ ఎందుకు తాత్సారం చేస్తున్నారనే దానిపై స్పష్టత రావడం లేదు. దీనికి తోడు విచారణ అధికారి మీడియాకు దూరంగా ఉండటం కూడా విమర్శలకు తావిస్తోంది. గతంలో పలు వివాదాలకు సంబంధించి విచారణలు, చర్యలు తూతూమంత్రంగా మారడంతో ఇంత పెద్ద విషయంలో కూడా అదే వైఖరిని అవలంభించేందుకే ఈ జాప్యం చేస్తున్నారని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అర్చకులు, ఆలయ అధికారులు ఒక వర్గంగా ఏర్పడి ఈవోను ఇరకాటంలో పెట్టేందుకే వివాదాలకు తెరలేపుతున్నారని ఆలయంలో మరో వర్గం వారు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయ తలుపులకు తాళాలు వేయకపోవడం, ఇప్పుడు మూలవరుల చిత్రాలను బయటకు పంపడం వంటివి దేవస్థానం పవిత్రకు భంగం కలిగించేవే అయినా ఏదో ఒక ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మూలవరుల చిత్రాలు గత శుక్రవారం నుంచి సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుండగా ఇప్పటివరకు దోషులను గుర్తించకపోవడంతో ఈ రకమైన ప్రచారం జరుగుతోంది. దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముక్కుసూటిగానే వ్యవహరిస్తున్నారు. దేవస్థానంలో ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన వారికి ఈవో నిబద్ధత నచ్చకే ఆయనను ఇరకాటంలో పెట్టే చర్యలకు దిగుతున్నారని, ఈ నేపథ్యంలోనే ఇటీవల రెండు వివాదాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు వస్తుండగా, ఇటువంటి వివాదాలతో ఈవోపై బురదచల్లేందుకు చూస్తున్నారని దేవస్థానంలోని కొందరు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. దేవస్థానంలో పరిణామాలు ఇలా ఉంటే.. ఈ వివాదాలపై రామభక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడికి భద్రత కల్పించడానికి భక్తులపై ఆంక్షలు విధించిన అధికారులే భద్రతను ప్రశ్నార్థకం చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. భక్తుల మనోభావాలను గుర్తించి దోషులను బహిర్గతం చేయాలని, అప్పుడే ఇటువంటి వివాదాలకు ఆస్కారం ఉండదని పేర్కొంటున్నారు.