ఖమ్మం

రాష్ట్ర ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(స్పోర్ట్స్), నవంబర్ 18: 64వ ఆల్ ఇండియా కో ఆపరేటివ్ వారోత్సవాల సందర్భంగా జిల్లా కోపరేటివ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి ఇన్విటేషన్ వాలీబాల్ పోటీలు స్థానిక సర్దార్‌పటేల్ స్టేడియంలో శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిధిగా వచ్చిన డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణలు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారోత్సవాల సందర్భంగా జిల్లాలో ఉద్యోగులకు క్రీడలు అవసరమనే దృష్ట్యా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. సహకార సంఘం ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ టోర్నీలో 12జట్లు పాల్గొంటున్నాయి. వరంగల్, సత్తుపల్లి, నల్గొండ, ఇల్లెందు, కొత్తగూడెం, మారుతి ఫౌండేషన్, సూర్యాపేట, ఖమ్మం జట్లతో పాటు లోకల్ జట్లు కూడా పాల్గొంటున్నాయని టోర్నమెంట్ ఆర్గనైజర్ లక్‌మల్ తెలిపారు. పోటీలు మూడురోజుల పాటు లీగ్‌కం నాకౌట్ పద్దతిలో నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. పోటీలను ఫ్లెడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించేందుకు రెండు వాలీబాల్ కోర్టులను సిద్ధం చేశామని తెలిపారు. పోటీలకు వచ్చిన క్రీడాకారులకు వసతీ, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో రాందాస్, కోటయ్య, కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా యువజన క్రీడాధికారి పరందామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
ఖమ్మం(స్పోర్ట్స్), నవంబర్ 18: 64వ అల్‌ఇండియా కోపరేటివ్ బ్యాంక్ వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు స్థానిక సర్దర్ పటేల్ స్టేడియంలో శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిధిగా వచ్చిన కబడ్డీ అసోషియేషన్ అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జట్లను ఆయన పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ టోర్నిలో 16జట్లు పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. మోతిగూడెం, గంగులనాచారం, చింతకాని, చెరువుమాధారం, మూలగూడెం, ఖమ్మం అకాడమి, ఖమ్మం అసోషియేషన్ తదితర జట్లతో పాటు 16జట్లు పాల్గొంటాయి. పోటీలు లీగ్‌కంనాకౌట్ పద్దతిలో ఫ్లెడ్‌లైట్ వెలుతురులో పోటీలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోషియేషన్ కార్యదర్శి కిష్ట్ఫర్, జిల్లా యువజన సంక్షేమ సంఘం క్రీడాధికారి పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.