ఖమ్మం

కేంద్ర పథకాలు అందరూ వినియోగించుకునేలా కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల చెప్పి వినియోగించుకునేలా అందరూ కృషి చేయాలని భారత జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీ్ధర్ అన్నారు. శనివారం నగరంలోని స్థానిక 47వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన బిజెపి జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అవినీతి రహిత పాలనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధికి అందరూ అకర్షితులవుతున్నారన్నారు. ఖమ్మం నగరంలో డ్రైనేజి వ్యవస్థ, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, పారిశుద్ధ్య పనులు, మున్సిపల్ సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్రంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై ప్రచారంలో తప్ప అమలులో విఫలమైందని ఆరోపించారు. టిఆర్‌ఎస్ చేపడుతున్న అభివృద్ధిలో వారి సహచరులకు ఉపయోగం తప్ప ప్రజలకు ఓరిగిందేమి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అవినీతి పాలనపై ప్రతి ఒక్కరు పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పార్టీల నుండి బిజెపి పార్టీలోకి చేరిన వారికి పార్టీ కండువ కప్పి ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమటం శ్రీనివాస్, వెల్పుల సుధాకర్, ప్రభాకర్‌రెడ్డి, శ్రీదేవి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

చిన్నారిని చిదిమేసిన కన్నతల్లి
మణుగూరు, నవంబర్ 18: కన్నతల్లే కాటేస్తుందని తెలియక తల్లి పిలుపుకు దగ్గరైన చిన్నారి తల్లి చేసిన ఆకృత్యంతో తనువు చాలించింది. శుక్రవారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని కమలాపురం గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన శశిరేఖ కథనంలో తల్లే ఆ బాలిక పాలిట మృత్యుదేవతైంది. అనుమానాస్పద మృతిగా శశిరేఖ మరణాన్ని నమోదు చేసుకున్న పోలీసులు ఆ దిశగా జరిపిన దర్యాప్తులో బాలిక తల్లే హంతకురాలిగా గుర్తించారు. శశిరేఖ తల్లి మరియమ్మ తన అక్క యశోద భర్త నాగేశ్వరరావుతో సహజీవనం కొనసాగిస్తున్న నేపథ్యంలో శశిరేఖ జన్మించినట్లుగా పోలీసుల ఎదుట పేర్కొంది. ఆ బాలిక తన బిడ్డ కాదంటూ, తనకు పుట్టలేదంటూ నాగేశ్వరరావు వాదనకు దిగడంతో పలుమార్లు పంచాయతీ జరిగిన అనంతరం పట్టరాని కోపంతో అతనిపై ఉన్న కోపాన్ని బాలికపై చూపించిన మరియమ్మ ఆమె మృతికి కారకురాలైంది. రెండుమూడు రోజులుగా కుటుంబ అంతర్గత తగాదాలు ముదిరి మరియమ్మ మనస్తాపానికి గురికావడంతో పట్టరాని ఆగ్రహాన్ని తెచ్చుకొని కన్న కూతురిని గొంతు నులిమి చంపేసింది. కోపంలో సంఘటన జరిగినప్పటికీ తొలుత ఎలా మరణించిందో తెలియదని చెప్పిన మరియమ్మ కన్నబిడ్డ దూరమైన ఆవేదనను తట్టుకోలేక జరిగిన విషయాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకుంది. ఆమె వాంగ్మూలం ప్రకారం బాలిక మృతికి కారణమని హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు మణుగూరు సిఐ మొగిలి విలేకర్లకు తెలిపారు. కేసు చేధించడంలో సమర్థవంతంగా వ్యవహరించిన ఎస్సై కుమారిస్వామి, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

విద్యుదాఘాతానికి వెల్డింగ్ కార్మికుడి మృతి
* మిషన్ భగీరథ పనుల్లో అపశృతి
పాల్వంచ, నవంబర్ 18: పాల్వంచ మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామంలో మిషన్ భగీరథ పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం తోగ్గూడెం తండాలో నివాసముంటున్న. జర్పుల మోహన్‌సింగ్ (22) గ్రామంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో భాగంగా గత మూడు నెలలుగా ఒక కాంట్రాక్టర్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తున్నాడు. రోజూ వెల్డింగ్ పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న విద్యుదాఘాతానికి మోహన్‌సింగ్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మోహన్‌రావు, లక్ష్మి, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని భోరున విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రూరల్ ఎస్‌ఐ బి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.