కృష్ణ

రుణాల మంజూరులో డీసీసీబీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 16: రుణాల మంజూరు విషయంలో కృష్ణాజిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రథమస్థానంలో ఉందని అప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం హనుమాన్ జంక్షన్ కేడీసీసీబీ బ్యాంక్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి అయన హాజరయ్యారు. ముందుగా స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పిన్నమనేని అనంతరం హనుమాన్ జంక్షన్ బ్రాంచి పరిధిలోని వివిధ కో ఆపరేటివ్ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో బ్రాంచి అవరణలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రుణాల మంజూరు విషయంలో 4400కోట్ల మంజూరుతో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వాణిజ్య బ్యాంక్‌లతో పోటీ పడుతోందని వివరించారు. నిరర్థక ఆస్తుల విషయంలో 2.89% మాత్రమే ఉండంతో ప్రస్తుత పరిస్థితి అశాజనకంగా ఉందని వాఖ్యానించారు. రిజర్వు బ్యాంక్ నింబంధన మేరకు 5శాతం ఉండాలన్నారు. అయితే రాష్ట్రంలోని కొన్ని వాణిజ్య బ్యాంక్‌ల శాతం 8.9 నుంచి 10 శాతం వరకు ఉండడం రిజర్వ్ బ్యాంక్‌కు ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. మొండి బకాయిల వసూళ్ళపై ప్రత్యేక దృష్టిసారించాలని, చట్టపరమైన చర్యలను ఉపయోగించి రుణాల రికవరీ శాతాన్ని పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ సీఇఓ కెయస్ సుబ్రమణ్యం, జనరల్ మేనేజర్ బి.ఎల్ చంద్రశేఖర్, డిజిఎమ్ నిరంజని, ఓఎస్డీ శ్రీనివాస్, బ్రాంచి మేనేజర్ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
‘సంజీవని’ పూర్తికి సహకరించాలి

* కూచిభొట్ల ఆనంద్

కూచిపూడి, ఫిబ్రవరి 16: నాట్య క్షేత్రం కూచిపూడిలోని పసుమర్తివారి ధర్మచెరువులో సిలికానాంధ్ర వసుధైక కుటుంబం నిర్మిస్తున్న సంజీవని మల్టి స్పెషాలిటీ వైద్యాలయం నిర్మాణం వేగవంతంగా కొనసాగుతోందని వ్యవస్థాపక చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ తెలిపారు. మొవ్వ మండలంతో పాటు పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఘంటసాల, గూడూరు మండలాల్లోని ప్రజలందరికీ తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలతో పాటు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్యాన్ని అందజేసేందుకు ఈ వైద్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆనంద్ తెలిపారు. రూ.35కోట్ల అంచనాలతో ఐదు అంతస్తుల వైద్యాలయం నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు రూ.13కోట్లతో సెల్లార్, గ్రౌండ్‌ఫ్లోర్, మూడు అంతస్తుల శ్లాబ్‌లు పూర్తయినట్లు తెలిపారు. ఈ ఏడాది దసరా పండుగ నాటికి వైద్యాలయ నిర్మాణం పూర్తిచేసి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.3కోట్లు మాత్రమే దాతలు విరాళాలుగా అందజేశారన్నారు. ఇందులో భాగంగా మొవ్వ మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మండవ బాలాత్రిపుర సుందరి విశేష కృషి ఫలితంగా దాదాపు కోటి రూపాయలు దాతలు ద్వారా విరాళాలుగా అందజేశారన్నారు. గతంలో వాగ్ధానాలు చేసిన దాతలతో పాటు ఈ వైద్యాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.3,500 వంతున దాతలు విరాళాలుగా ఇవ్వాలని ఆనంద్ కోరారు. ఈ సమావేశంలో నిర్మాణ పర్యవేక్షకులు పామర్తి శివప్రసాద్, బెల్లంకొండ వెంకటేశ్వరరావు, అనే్న రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత

* ఉపసభాపతి బుద్ధప్రసాద్
నాగాయలంక, ఫిబ్రవరి 16: ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని భావదేవరపల్లి శివారు కుమ్మరిపాలెం గ్రామంలో శుక్రవారం రూ.15లక్షల ఎన్‌ఇర్‌ఇజీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సైతం కోట్లాది రూపాయలను ఖర్చు చేయటం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో సిమెంట్ రహదారులను నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని, అందుకు కుమ్మరిపాలెంలో నిర్మించిన సిమెంట్ రహదారి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. ఈ సభకు సర్పంచ్ మండలి బేబి సరోజిని అధ్యక్షత వహించగా ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ, నాగాయలంక పీఎసీఎస్ అధ్యక్షుడు వర్రే రాంబాబు తదితరులు పాల్గొన్నారు.