ఖమ్మం

ఎంబీసీలకు అండగా టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 25: ఎంబిసిలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంబిసి సంక్షేమానికి నిధులు కేటాయించిన సందర్భంగా ఎంబిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు నేతలు ఎంపిని కలిసి పూలమొక్కను అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ 60ఏళ్ళ సుదీర్ఘపోరాటం తరువాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించడమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అందులో భాగంగానే ఎంబిసి అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కెసిఆర్ వెయ్యికోట్ల బడ్జెట్‌ను కేటాయించారన్నారు. అనంతరం సంఘ సభ్యులు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎంపికి అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు మూర్తి, సోమ్లానాయక్, ఎంబిసి సంక్షేమ సంఘం నాయకులు షకీనా, దరిపల్లి శ్రీనివాస్, సోమరాజు, వెంకటేశ్వర్లు, సుధాకర్, రంజాన్, రజియా తదితరులు పాల్గొన్నారు.