ఖమ్మం

ప్రీ పెయిడ్ పవర్ మీటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 25: ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేందుకు విద్యుత్ శాఖ సన్నద్ధమవుతోంది. సంస్థకు భారంగా మారిన మొండి బకాయిలకు చెక్ పెట్టడంతో పాటు విద్యుత్‌ను పొదుపుగా వాడుకునేందుకు ప్రీ పెయిడ్ పవర్ మీటర్లను తీసుకువస్తోంది. వీటిని ప్రయోగాత్మకంగా ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రమే వాడాలని నిర్ణయించారు. త్రీఫేజ్ మీటర్‌కు 10వేలు, సింగిల్‌ఫేజ్ మీటర్‌కు 2నుంచి 4వేల రూపాయల వరకు వీటికి ఖర్చవుతుంది. సెల్‌ఫోన్ రీచార్జ్ మాదిరిగానే విద్యుత్ రీచార్జ్‌ను చేయించుకోవాలి. వినియోగదారులు ఎంత కరెంటు వాడుకుంటే అంతే ఖర్చు అవుతోంది. ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా రోజు ఎంత ఖర్చవుతుందో తెలిసిపోతుంది. ప్రీపెయిడ్ మీటర్లో డబ్బులు అయిపోయే ముందు అందులో ఉండే ఒక ప్రత్యేక బల్బు వెలుగుతూ ఉంటుంది.
మార్చి మొదటి వారం నుంచి రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కనీసం 500రూపాయలు ఖచ్చితంగా రీచార్జ్ చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నారు. జూన్ నుంచి పాఠశాలలు, గృహాలకు కూడా ఈ ప్రీపేయిడ్ మీటర్లను అమర్చాలని డిస్కం నిర్ణయం తీసుకుంది. ఈ విధానంతో విద్యుత్ బిల్లుల బకాయిల వసూళ్ళకు చెక్ పడినట్లు అవుతుంది. దీనికి తోడు ఆదాయం పెరిగి సంస్థ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది. రెండు జిల్లాల పరిధిలో 17లక్షల మేర విద్యుత్ కనెక్షన్లు ఉన్నప్పటికీ తొలి విడతగా వెయ్యిలోపే ప్రీ పెయిడ్ మీటర్లను అమర్చనున్నారు. ప్రీ పెయిడ్ మీటర్ల ద్వారా విద్యుత్ వాడకం తగ్గుతోందని, ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఇష్టానుసారంగా కరెంటు వాడుతున్నారని, పొదుపు చేయాలన్న ఆలోచన కూడా లేకుండా పోయిందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. అవసరం లేకున్నా లైట్లు, ఫ్యాన్లు, ఏసిలు పనిచేస్తూనే ఉంటాయని, దీంతో వేలల్లో బిల్లులు వస్తున్నాయని, తిరిగి భారం ప్రభుత్వంపైనే పడుతుందని చెబుతున్నారు. ముందస్తుగా ఆ కార్యాలయానికి ఎంత విద్యుత్ అవసరమో అంతమేరకే రీచార్జ్ చేసి విద్యుత్ సరఫరా చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించకపోయినప్పటికీ సరఫరాను నిలిపివేసే పరిస్థితి లేదు. దీంతో లక్షల్లో బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా ఇలాంటి సంఘటనలకు చెక్ పడనున్నది. ప్రభుత్వ కార్యాలయాల్లో విజయవంతమైతే గృహ వినియోగదారులకు కూడా దీనిని అందుబాటులోకి తేనున్నారు. తద్వారా విద్యుత్ అనవసర వాడకాన్ని నియంత్రించవ్చని, తద్వారా మరింత పారదర్శకంగా సరఫరా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.