క్రైమ్/లీగల్

హోలీ వేడుకల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, మార్చి 2: టేకులపల్లి మండలంలోని గంగారం ఆశ్రమ ఉన్నత గిరిజన పాఠశాల హాస్టల్‌లో జరిగిన హోలీ పండగ వేడుకల్లో విషాదం నింపింది. గురువారం హోలీ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో 10వ తరగతి చదువుతున్న హాస్టల్ విద్యార్థి అజ్మీర ప్రసాద్ (14) రంగులు పూసుకుంటూ ఆడుతూ హాస్టల్ రెండో అంతస్తు సన్ సైడ్ మీదకు ఎక్కే క్రమంలో కాలుజారి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హాస్టల్ వార్డెన్ వెంటనే కొత్తగూడెం వైద్యశాలకు తరలించారు. అక్కడి విద్యార్థి పరిస్థితి విషమంగా మారడంతో హైద్రాబాద్ తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడు ప్రసాద్ మండలంలోని తడికలపూడి గ్రామ పంచాయతీ కోక్యా తండా గ్రామానికి చెందిన అజ్మీర కిషన్, అమ్రి దంపతుల ఏకైక సంతానం. మృతదేహాన్ని హైద్రాబాద్ నుండి ఇంటికి తీసుకువచ్చారు. కోక్యాతండాలోని వారి ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి వారి బంధువులతో ధర్నాకు దిగారు. దీంతో కోక్యాతండాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. టేకులపల్లి సి ఐ దోమల రమేశ్, టేకులపల్లి, బోడు ఎస్ ఐలు ప్రవీణ్ కుమార్, అరకుల అనిల్ హుటాహుటిన కోక్యాతండా చేరుకున్నారు. మండలంలో కస్తూర్భాగాంధీ పాఠశాలలో భూమిక అనే విద్యార్థిని మృతి చెందిన విషయం మరవక ముందే, ఈ సంఘటన జరగటంతో విద్యార్థి తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రసాద్ మృతదేహంతో ధర్నాకు దిగడంతో విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు భారీ ఎత్తున చేరుకుని మద్దతు తెలిపారు. 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కుటుంబానికి మూడు ఎకరాల సాగు భూమి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎటిడబ్ల్యు సత్యనారాయణ కోక్యాతండాకి చేరుకుని మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని తెలిపారు. గంగారం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులు, వార్డెన్, సిబ్బందితో చర్చించి మృతుడి కుటుంబానికి లక్షా 50 వేలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసి లక్కినేని సురేందర్, పిడియస్‌యు విద్యార్థి సంఘనాయకులు ఎట్టి ప్రశాంత్, రవి, కాంగ్రేస్ పార్టీ నాయకులు భూక్యా ధళ్‌సింగ్ నాయక్, ఎన్డీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.