ఖమ్మం

కోవర్ట్ ఆపరేషన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 3: తెలంగాణ - చత్తీస్‌గఢ్ సరిహద్దులోని పూజారికాంకేర్ జిల్లా పరిధిలో 10 మంది మావోయిస్టులు మృతి చెందడం వెనక పెద్ద కోవర్టు ఆపరేషన్ జరిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలో మావోయిస్టుల నుంచి అసలు ప్రతిఘటన లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూజారికాంకేర్ జిల్లా ఊసూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఈ నెల 2వ తేదీ ఉదయం మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగే సమావేశాలకు అగ్ర నేతలు కూడా వస్తున్నారనే ప్రచారంతో పోలీసులకు ముందుగానే సమాచారం అందింది. దీంతో వారిని చుట్టుముట్టాలని పథకం వేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇన్‌ఫార్మర్ వ్యవస్థను రంగంలోకి దింపి, రామగూడ ప్రాంతంలో మావోయిస్టులకు సహకరిస్తున్న వారితో పాటు, పోలీసులకు అనుకూలంగా ఉన్న కొందరు మిలీషియా సభ్యులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారని సమాచారం. ఈ నెల 1వ తేదీ కల్లా మావోయిస్టు కీలక నేతలు వచ్చే అవకాశం ఉందని తెలుసుకున్న బలగాలు గుట్టు చప్పుడు కాకుండా తమ పథకాన్ని అమలుచేశారని తెలుస్తోంది. కాలకృత్యాలు తీర్చుకుంటున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడటం వల్లనే మావోయిస్టులు ప్రతిఘటించలేకపోయారని వాదన వినిపిస్తోంది. కాల్పులు ఏకపక్షంగా జరగడం వల్లనే మావోయిస్టులకు నష్టం కలిగిందని చెబుతున్నారు.

తెలుగునాటక రంగానికి సేవలందించడం మా అదృష్టం
* మే 1నుండి అఖిలభారత స్థాయి నాటకపోటీలు * పరుచూరి వెంకటేశ్వరరావు
ఖమ్మం(కల్చరల్), మార్చి 3: ఎదిగే వయస్సులోనే నేలతల్లి ఒడిలోకి ఒదిగిన మా కుమారుడు రఘుబాబు జ్ఞాపకార్థం తెలుగు నాటకరంగానికి సేవలందించాలనే పవిత్రమైన ఆశయంతో గత 27 ఏళ్ళుగా ముందుకు సాగడం మా అదృష్టంగా భావిస్తున్నామని ప్రముఖ సినీ రచయిత, నటులు, దర్శకులు పరుచూరి వెంకటేశ్వరరావు తెలిపారు. పరుచూరి రఘుబాబు 28వ స్మారక అఖిలభారత స్థాయి నాటకపోటీలు నిర్వహించే దానిలో భాగంగా శనివారం స్ధానిక భక్తరామదాసు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రఘుబాబు జ్ఞాపకార్ధం 28వ నాటకపోటీలను తెలుగురాష్ట్రాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచ కార్మికదినోత్సవాన్ని పురస్కరింకుని మే 1నుండి 4వరకు ఖమ్మంలో ఖమ్మం కశాపరిషత్, ప్రజానాట్యమండలి నిర్వాహణలో భక్తరామదాసుకళాక్షేత్రంలో నాటక పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి మొత్తం 100 ఎంట్రీలు అందాయన్నారు. ఇందులో 7 నాటకాలు, 12 నాటికలను ఎంపికచేసి తుదిపోటీలను నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఎంపికైన ప్రతి నాటకానికి 20వేలు, నాటికకు 15వేలు ప్రదర్శనా పారితోషికంగా ఇస్తామన్నారు. అలాగే రెండు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఉత్తమ, ద్వితీయ ప్రదర్శనలకు అవార్డులతో పాటు వ్యక్తిగత బహుమతులుంటాయన్నారు. పరుచూరి రఘుబాబు స్మారక అఖిలభారతస్థాయి నాటకపోటీలు నాటకరంగానికి, సినీరంగానికి నడుమ వారధిగా మలచి ఇప్పటివరకు ఎందరో నాటక కళాకారులను సినీరంగానికి పరిచయం చేయడం ఆనందంగా ఉందన్నారు. కోటీఇరవైలక్షల వ్యయంతో సొంతగా నిర్మించుకున్న ఆడిటోరియం, 80లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్‌తో తెలుగునాటకరంగ అభివృద్ధికి పాటుపడుతున్నది కేవలం పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ అని ఆయన గర్వంగా తెలిపారు. ఇది ఇలాగే నాలుగు కాలాలపాటు కొనసాగుతూ, తెలుగు నాటకరంగానికి ఉపయోగపడాలనేదే ఆయన ఆశయమన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు వివి అప్పారావు, నాగబత్తిని రవి, ప్రజానాట్యమండలి అధ్యక్ష, కార్యదర్శులు జ్యోజి, ఎఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.