ఖమ్మం

భద్రాద్రికి బ్రహ్మోత్సవ శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 17: భద్రాద్రి బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. స్వాగతద్వారాలు.. చలువ పందిళ్లు.. చాందినీ వస్త్రాలంకరణలు.. విద్యుత్ దీపాలతో రామాలయ పరిసరాలు.. దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. ఆదివారం ఉగాది పర్వదినం రోజు వసంత ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 26వ తేదీ నవమి రోజున మిథిలాస్టేడియంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం రామాలయాన్ని, పరిసరాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయగా పట్టణం సరికొత్త శోభను సంతరించుకుంది. బ్రహ్మోత్సవాల తొలి రోజైన విళంబి నామ సంవత్సర ప్రారంభం సందర్భంగా ఉదయం వేపపూత ప్రసాద వితరణ, శ్రీ సీతారామచంద్రస్వామి మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించనున్నారు.
నేటి నుంచి నిత్య కల్యాణాలు నిలిపివేత
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నేటి నుంచి ఆలయంలో నిత్య కల్యాణాలను నిలిపివేయనున్నారు. ఇందుకో ప్రత్యామ్నాయంగా ప్రతిరోజు తిరువీధిసేవ నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వోత్సవాలు (దర్బార్‌సేవ), పవళింపు సేవలను సైతం ఏప్రిల్ 1వ తేదీ వరకు నిలిపి వేయనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న ఉత్సవ అంకురారోపణ, తిరువీధిసేవ, 23న తిరువీధిసేవ, 24న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, దేవతాహ్వానం, బలిహరణం, హనుమంత వాహనంపై తిరువీధిసేవ, 25న ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. 26న సీతారాముల కల్యాణం, 27న పట్ట్భాషేకం, 28న సదస్యం, 29న తెప్పోత్సవం, దొంగలదోపు ఉత్సవం, అశ్వవాహన సేవ, 30న ఊంజల్‌సేవ, సింహవాహనసేవ, 31న వసంతోత్సవం, రాత్రి గజవాహనసేవ, ఏప్రిల్ 1న చక్రతీర్థం, పూర్ణాహుతి, ద్వాదశ ఆరాధనలు, ధ్వజారోహణం, శేష వాహన సేవతో ఉత్సవాలు పరిసమాప్తి అవుతాయని వేద పండితులు తెలిపారు.
నేడు ఉగాది వేడుకలు
శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రామాలయంలో విళంబినామ సంవత్సవ ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా షడ్రుచులతో కూడిన ప్రసాద పంపిణీ చేస్తామని, సాయంత్రం పంచాంగ శ్రవణం కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు.