ఖమ్మం

నకిలీలను ఉపేక్షించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 19: కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయిస్తే ఉపేక్షించేది లేదని పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ హెచ్చరించారు. పోలీస్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్, వ్యవసాయాధికారులతో జిల్లావ్యాప్తంగా ఖమ్మం, వైరా, ఖమ్మంరూరల్, కల్లూరు డివిజన్లలో జాయింట్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కల్తీ, నకిలీ, నాణ్యత విత్తనాలు విక్రయించే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. విత్తనశుద్ధి కేంద్రాలు, విత్తన నిల్వ గోదామ్‌లు, డిస్ట్రిబ్యూటర్స్ డీలర్ల దుకాణాల్లో సోదాలు జరిపి శ్యాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపాలన్నారు. తనిఖీలు నిర్వహించే ముందు వీడియో కెమెరాల ద్వారా రికార్డు చేయాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామ, మండల రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో టాస్క్ఫోర్స్ ఏసిపి రెహ్మాన్, సిఐలు సంపత్‌కుమార్, ఆంజనేయులు, కరుణాకర్, వ్యవసాయాధికారులు కె వెంకటేశ్వరరావు, ఏడి పి మణిమాల, వి శ్రీనివాసరావు, ఏఓ పి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భద్రతే బాధ్యతగా విధులు నిర్వహించాలి
ఖమ్మం(క్రైం): ప్రజల భద్రతే ప్రథమ బాధ్యతగా గుర్తెరిగి పోలీసులు విధులు నిర్వహించాలని కమిషనర్ తఫ్సీర్‌ఇక్భాల్ అన్నారు. ఖమ్మం జిల్లాకు ఎంపికై శిక్షణ పూర్తిచేసుకున్న 234మంది ట్రైనీ కానిస్టేబుల్‌లకు సోమవారం పోస్టింగ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది విధులు నిర్వహించాలన్నారు. చీఫ్ ఆఫ్ ఆఫీస్ ఉత్తర్వులు నిబంధనలకు అనుగుణంగా ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌కు 71మంది కానిస్టేబుళ్ళను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 158 మంది, జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాకు 8 మంది, మహబూబాబాద్ జిల్లాకు ముగ్గురు కానిస్టేబుళ్ళను కేటాయించారన్నారు. ఏవైనా వ్యక్తిగత సమస్యలు వుంటే ముందుగా కేటాయించిన జిల్లాలకు వెళ్ళి రిపోర్ట్ చేసిన అనంతరం ఆయా జిల్లాల నుండి రిక్వెస్ట్ పిటిషన్‌ను జిల్లా పోలీస్ అధికారులకు అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ ఎసిపి వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ శ్రీనివాస్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

పది పరీక్షల తీరుపై ఫిర్యాదుకు ఫోన్ చేయండి
* డీఈఓ మదన్‌మోహన్
కల్లూరు, మార్చి 19: జిల్లాలో జరుగుతున్న పది పరీక్షల నిర్వహణపై ఎలాంటి ఫిర్యాదులున్న 8331851510కి ఫోన్ చేస్తే తక్షణమే చర్యలుంటాయని డిఇఓ మదన్‌మోహన్ పేర్కొన్నారు. సోమవారం కల్లూరు వచ్చిన ఆయన మండల పరిధిలోని చిన్నకోరుకొండి, కల్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గురుకుల బాలికల పాఠశాల పరీక్షాకేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో 18,436మంది విద్యార్థులు పది పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు జరుగుతున్న తీరును ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు, ఆర్‌జెడీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. జిల్లాలో రెండు మోడల్ స్కూల్స్, ఖమ్మంలో 4 పరీక్షాకేంద్రాల్లో ఈ ఏడాది జరుగుతున్న పది పరీక్షల పనితీరును పరిశీలించేందుకు సీసీ కెమేరాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఏ అధికారి వద్ద కూడా ఫోన్ అనుమంతించరని తన ఫోన్ కూడా పరీక్షా కేంద్రాలు పరిశీలించేందుకు వెళ్లే ముందు తమ వాహనం లోపల వదిలి వెళుతున్నానని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీకి అవకాశం లేదని అలాంటి సంఘటనలు జరిగితే పరీక్షా కేంద్రాల వద్ద, ఎంఇఓ, డీఇఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పుస్తకంలో రాయవచ్చని వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏడాది పది పరీక్షల ఉత్తీర్ణతా శాతం అధికంగా ఉండవచ్చనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ కాకర్ల రంగారావు పాల్గొన్నారు.

2019 విద్యా సంవత్సరానికి కార్యాచరణ రూపొందించాలి
ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 19: 2018-19 విద్యా సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సర్వశిక్ష అభియాన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమై రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి తీసుకోవలసిన చర్యలపై సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమయ్యే వౌలిక సదుపాయాలను కల్పించడంకోసం ప్రతిపాదనలు సమకూర్చుకోవాలన్నారు. విద్యాశాఖకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకోవడం కోసం సర్వశిక్ష అభియాన్ లక్ష్యాలను సాధించడంకోసం జిల్లా ప్రణాళిక సభ్యులతో రెండు రోజుల్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలకు సంబంధించిన వనరులను గుర్తించి నివేదిక సమర్పించాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను క్రోడీకరించి జిల్లా విద్యా ప్రణాళికలో పొందుపర్చాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ ఉపసంచాలకులు కె సత్యనారాయణ, మైనార్టీస్ సంక్షేమ అధికారి రమేష్, బిసి వెల్ఫేర్ అధికారి హృషికేశరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరీక్షా కేంద్రాలను
తనిఖీ చేసిన ఆర్జేడి
తిరుమలాయపాలెం, మార్చి 19: తిరుమలాయపాలెం, పిండిప్రోలు హైస్కూళ్లలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాలను సోమవారం రీజనల్ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి మాస్ కాపీయింగ్ జరుగకుండా చూడాలని ఆయన పరీక్షల నిర్వహణాధికారులను ఆదేశించారు. విద్యార్థుల వివరాలు, పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు సమకూర్చిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలావుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బంది బీరోలు, సుబ్లేడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.