ఖమ్మం

రూ. 10,400కు చేరిన మిర్చి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 19: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మిర్చి ధర రోజురోజుకు పెరుగుతుండటంతో జిల్లా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మార్చి మొదటి వారం వరకు మిర్చి పంటకు 9,125 రూపాయల గరిష్ట ధర మాత్రమే ఉన్న ధర సోమవారం 10,400 రూపాయలకు చేరుకోవటంతో మిర్చి రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం లాగా మిర్చి పంటకు ధర ఎక్కడ తగ్గుతుందోనని ఆందోళన చెందిన రైతులు గత 4రోజుల నుండి ధరలో స్వల్ప మార్పులు వస్తుండటం, సోమవారం ఒక్కసారిగి 10,400కు పెరగటంతో ఈ సంవత్సరం తమ కష్టాలు తీరినట్లేనని రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద వరంగల్ మార్కెట్‌లో సైతం ఇంతటి ధర లేకపోవటంతో వరంగల్ జిల్లాకు చెందిన కొంత మంది రైతులు ఖమ్మం మార్కెట్‌కు మిర్చి పంటను తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఖమ్మం జిల్లాకు సరిహద్దులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు ఖమ్మం మార్కెట్‌పై మక్కువు చూపిస్తున్నారు. ఖమ్మం మార్కెట్‌లో మిర్చికి ధర పెరిగినప్పటికీ సోమవారం 17,107 మిర్చి బస్తాలు మాత్రమే రావటం గమనార్హం. కాగా ఈ సంవత్సరం మిర్చి పంటకు ఎక్కువ దిగుబడి లేకపోవటంతోనే ఎక్కువ ధర పలుకుతుందని, రానున్న రోజుల్లో కూడా మిర్చికి మరింత ధర పెరిగే అవకాశం ఉందని విశే్లషకులు వెల్లడిస్తున్నారు. దీంతో కొంత మంది వ్యాపారులు మిర్చి పంటను కొనుగోలు చేసి కొల్డ్‌స్టోరేజిలలో నిల్వవుంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా గత నెల చివరి వరకు మిర్చి ధర ఎక్కడ తగ్గుతుందోనని ఆందోళనతో హడావిడిగా అమ్ముకున్న రైతులు ధర పెరగటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికి గత సంవత్సరం కంటే ఈ సారి మిర్చి పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు కొంత లబ్ధి చేకురనున్నదని వ్యాపార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

అర్జీలను సత్వరం పరిష్కరించాలి
ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 19: ప్రజల ఆర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ప్రజలనుండి వినతులను స్వీకరించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకసారి ప్రజావాణికి వచ్చిన వారు అదే సమస్యపై మళ్శీ మళ్ళీ రాకుండా వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. ప్రజలు తమ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చారు. సింగరేణి మండలంలో టేకులగూడెం, తొడుగులగూడెం, పంతులునాయక్ తదితర గ్రామాలలో గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళకు బిల్లులు మంజూరుకాక అసంపూర్తిగా నిలిచిపోయాయని, వాటికి వెంటనే బిల్లులు మంజూరు చేసి పేదలను ఆదుకోవాలని, అర్హత కలిగిన ప్రతి పేదవారికి డబుల్‌బెడ్‌రూం ఇళ్ళు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కలెక్టర్‌కు విన్నవించారు. కల్లూరు మండలం లోకారం గ్రామానికి చెందిన 70మంది నిరుపేద రైతులకు 1974లో అక్కడి ప్రభుత్వం సర్వే నెం. 364లో ఒక్కోరైతుకు రెండెకరాల భూమిచొప్పున 139.20 ఎకరాల అసైన్డ్ భూమికి పట్టాలిచ్చిందని ప్రస్తుతం ఆ భూమి ఫారెస్ట్ పరిధిలో ఉందంటూ రెవిన్యూ అధికారులు రైతుల పేరు మీద ఆన్‌లైన్ చేయడంలేదని అంతేకాకుండా ఇదే సర్వే నెం.లో 24 ఎకరాల భూమిని రైతుల పేర్లు తొలగించి గువ్వల రాంరెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఆన్‌లైన్ చేశారని వీటిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవ లబ్ధిదారులైన నిరుపేదల రైతుల పేరు మీద ఆన్‌లైన్ చేసి అన్ని హక్కులు కల్పించాలని బాధిత రైతులు కలెక్టర్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హనుమంతు కొడింబా, జిల్లా అధికారులు పాల్గొన్నారు.