ఖమ్మం

బోదవ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలాయపాలెం, మార్చి 23: బోదకాలు వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కొండల్‌రావు అన్నారు. మండలంలోని కాకరవాయి గ్రామంలో శుక్రవారం బోధకాలు వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల వల్ల బోధకాలు వ్యాధి సంక్రమిస్తుందని, గ్రామంలో దోమలు లేనివిధంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురికి కాల్వలలో నీరు నిల్వ లేకుండా చూడాలని, మంచినీరు నిల్వ చేసినప్పుడు వాటిపై మూతలు ఉంచాలని, దోమలు వ్యాప్తి చెందకుండా మందులు పిచికారి చేయాలన్నారు. ఒకరికి కుట్టిన దోమ మరొకరికి కుట్టినా బోధకాలు వ్యాధి సోకుతుందని, దోమతెరలు ఉపయోగించుకొని జాగ్రత్తలు పాటించాలన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బోధకాలు వ్యాధి సోకినవారితో షార్ట్ఫిల్మ్ తీసి కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ మాలతి, డిఎంఓ రాంబాబు, పిహెచ్‌సి వైద్యులు రాంబాబు, హెచ్‌ఇఓ నగేష్, సుబ్బలక్ష్మి, మాధవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

భగత్‌సింగ్ ఆశయ సాధనకు కృషి చేయాలి
ఏన్కూరు, మార్చి 23: విప్లవ వీరుడు స్వాతంత్య్ర సమరయోధుడైన భగత్‌సింగ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి జాగర్లమూడి రంజిత్‌కుమార్ కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం సాయత్రం భగత్‌సింగ్ వర్థంతి సందర్భంగా ప్రదాన సెంటర్‌లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతిపిన్న వయస్సులోనే ఆగ్లేయులకు వ్యతిరేకంగా సాతంత్య్రంకోసం పోరాటాలు నిర్వహించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు భగత్‌సింగ్ అని కొనియాడారు. విప్లవ వీరులైన భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖుదేవ్‌ల వర్థంతులను జయంతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసారు. భగత్‌సింగ్‌ను, విద్యార్థులు, యువకులు అదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి తోడ్పాడాలని కోరారు. కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇటుకాల రామకృష్ణ, సిపిఐ మండల కార్యదర్శి అమరనేని వీరభద్రం, జిల్లా నాయకులు వర్థబోయిన శ్రీను, మంకినక్రిష్ణ, మురళి, నగేశ్వరరావు, హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

నేడు టీఎన్జీఓల సహకార సొసైటీ కమిటీ ఎన్నిక
ఖమ్మం(మామిళ్ళగూడెం), మార్చి 23: టిఎన్‌జివోస్ కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ నూతన కమిటీని శనివారం ఎన్నుకోనున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఉద్యోగులు డైరెక్టర్‌ల ఎన్నికను నిర్వహించుకున్నారు. ఎన్నికైన 7గురు డైరెక్టర్‌లు నూతన కమిటీని ఎన్నుకోవాల్సివుంది. స్థానిక టిఎన్‌జీవోస్ పంక్షన్‌హాలులో శనివారం ఎన్నికల అధికారి ఎన్‌విఎస్ ప్రసాద్ సమక్షంలో 7గురు డైరెక్టర్లు ఏలూరి శ్రీనివాసరావు, పొట్టపెంజర రామయ్య, జి.నరేందర్, పెద్దమళ్ళ సత్యనారాయణ, మూట గోపాల్, వెంకటనర్సమ్మ, అక్తరున్నీసాభేగంలు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకుంటారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఏలూరి శ్రీనివాసరావు, పొట్టపెంజర రామయ్య, కోశాధికారిగా పెద్దమళ్ళ సత్యనారాయణలను ఎన్నుకునే అవకాశం ఉంది.