ఖమ్మం

సీతారామ ప్రాజెక్టు భూసేకరణ గ్రామసభ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలూరుపాడు, మార్చి 23: మండల కేంద్రమైన జూలూరుపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికై అవసరమైన భూసేకరణ కోసం శుక్రవారం నిర్వహించిన గ్రామసభ రెండవ సారికూడా వాయిదాపడింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన పాల్వంచ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించటం జరుగుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూసర్వే పనులు దాదాపు పూర్తయ్యాయని, రెవిన్యూ రికార్డుల ప్రకారం సంబంధిత రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే నష్టపరిహారం జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే జూలూరుపాడుకు చెందిన దాదాపు 30 మంది రైతులు గ్రామసభకు హాజరై తరాల నుంచి రెవిన్యూ రికార్డుల్లో ఉన్న తమ భూములు అటవీశాఖకు చెందిన భూములని పేర్కొంటూ అన్యాయం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకు దిగారు. 250, 277 సర్వే నెంబర్లలో సుమారు 60 ఎకరాల భూమి సర్వే ప్రకారం ప్రాజెక్టు కింద దళితులు కోల్పోతుండగా అట్టి భూమి తమకు సంబంధించినది కాదని అధికారులు పేర్కొనడం సరైందికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేద దళిత రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో దళితసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని వ్యక్తం చేశారు. వీరితోపాటు గిరిజనేతర రైతాంగం కూడా ఎకరానికి ప్రభుత్వం ప్రకటిస్తున్న రూ 8లక్షల నష్టపరిహారాన్ని వ్యతిరేకించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న భూములను తక్కువ ధరకు వదులుకునే ప్రసక్తేలేదని, ఎకరానికి రూ 15లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయటంతో సభ వాయిదా పడింది. ఉన్నతాధికారుల సమక్షంలో రైతులతో కలిసి చర్చించి సమస్యను పరిష్కరించుకుందామని ఎస్‌డిసి రైతులకు తెలిపారు. ఈ సభలో తహశీల్దారు జక్కని స్వర్ణ, సర్పంచ్ పాయం వెంకటరమణ, ఎంపిటిసి సాయిల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కాల్వ నిర్వాసితులకు ఇళ్ళు నిర్మించాలి
ఖమ్మం(గాంధీచౌక్), మార్చి 23: ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్‌లోని కాల్వపై నివాసం ఉంటున్న వారికి ఇళ్ళు కట్టించి ఇవ్వాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హౌసింగ్ అంశంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఖమ్మం పర్యటనలో భాగంగా శ్రీనివాసనగర్‌కు వచ్చిన క్రమంలో పేదవాళ్ళు నివాసం ఉంటున్న నిర్వాసితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హమీ మేరకు వారికి అక్కడే ఇళ్ళు కట్టించాలన్నారు. శ్రీనివాసనగర్ కాల్వపై గుడిసెలు వేసుకున్న పేదలకు ఇన్‌సీటు పద్ధతిపై డబుల్ బెడ్‌రూం ఇళ్ళు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. పేదలు సహకరించి ఖాళీ చేసి ఇస్తే అక్కడే ఇళ్ళు కట్టి ఇస్తామని హమీ ఇచ్చారని గుర్తు చేశారు. పేదలు అక్కడ నుండి వెళ్లాడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని ఉన్న చోట ఇళ్ళు కట్టిన అనంతరం మళ్ళీ వచ్చేందుకు వారు అంగికరించినట్లు వివరించారు. అందుకు జిల్లా కలెక్టర్ స్పందించి అయాశాఖకు ప్రతిపాదనలు పంపారని పేర్కొన్నారు. స్పందించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎమ్మెల్యే అజయ్ ప్రస్తావించిన సమస్యను తక్షణమే పరిశీలించి అమలకు చర్యలు తీసుకుంటామని హమీనిచ్చారు.