ఖమ్మం

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, మార్చి 23: భద్రాద్రి రామయ్య జగత్కాల్యాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వస్తారో, రారో అనే ప్రచారం భద్రాద్రిలో జోరుగా సాగుతోంది. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, అధికార పార్టీ నేతలకు మావోయిస్టుల హెచ్చరికలు తదితర కారణాలతో ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందనే వార్తలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలే కాకుండా జిల్లా అధికారులు సైతం దీనిపై నోరు మెదపకపోవడం ఈ సందేహాలకు ఊతమిస్తోంది. ఇదిలా ఉండగా మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి నవమికి వచ్చి పట్ట్భాషేకం రోజు భద్రాద్రిలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే వీలుందని ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. దానికి సంబంధించి ఎటువంటి పనులు జరగకపోవడం కూడా ముఖ్యమంత్రి పర్యటన రద్దయిందనే వాదనకు బలం చేకూరుస్తోంది. దీనికి తోడు అభివృద్ధి పనులకు సంబంధించి భద్రాద్రిలో ఎటువంటి శిలాఫలకాన్ని అధికార యంత్రాంగం ఏర్పాటు చేయకపోవడాన్ని పలువురు ఉటంకిస్తూ సీఎం రారని తేల్చి చెబుతున్నారు. ఈ పరిస్థితుల నడుమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో నాలుగు రోజుల ముందుగానే ముఖ్యమంత్రుల పర్యటనపై సంకేతాలు వచ్చేవి. నవమికి ఒకరోజు ముందు అధికారికంగా పర్యటన వివరాలు వెల్లడించేవారు. కానీ ఈసారి ఎటువంటి స్పష్టమైన ప్రకటన చేయకపోవడం సందేహాలకు తెరలేపినట్లైంది. ఈ నేపథ్యంలో భద్రాద్రివాసుల్లో అయోమయం నెలకొంది. మూడేళ్లుగా ఊరిస్తూ వస్తున్న భద్రాద్రి రామాలయం అభివృద్ధికి పట్ట్భాషేకం రోజు బీజం పడుతుందని భావించిన వారంతా సీఎం రారన్న ప్రచారంతో అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన వరుస ఎదురు కాల్పులతో భద్రాచలం మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు భారీ స్థాయిలో మావోయిస్టులకు చేరవేస్తున్న పేలుడు పదార్థాలు పట్టుబడటంతో మావోలు భారీ విధ్వంసానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా వర్గాలు కూడా దీనిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం, గవర్నర్లు ఈ పరిస్థితుల్లో భద్రాచలం వస్తే భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని, ఆ కారణంతోనే సీఎం పర్యటన రద్దవుతుందని మరికొందరు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా భద్రాచలంలో ఈ నెల 26న జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్, 27న జరిగే పట్ట్భాషేకానికి గవర్నర్ నరసింహన్ రానున్నారనే ప్రచారం ముందు నుంచి జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సర్వం సమాయాత్తమైంది. కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు ముఖ్యమంత్రి తీసుకురావడం ఆనవాయితీ కావడంతో కేసీఆర్ దంపతుల పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. పోలీసు అధికారులు భద్రత ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కేసీఆర్ నవమి రోజు వచ్చి మరుసటి రోజు పట్ట్భాషేకం చూసి, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్న ప్రచారం మొదటి నుంచి జరుగుతోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇంతవరకు అధికార వర్గాలు సీఎం రాకపై స్పష్టంగా చెప్పలేకపోతున్నాయి. మంత్రుల నుంచి, అధికార వర్గాల నుంచి దీనిపై స్పష్టత రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. రేపటిలోగా ముఖ్యమంత్రి పర్యటనపై స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రముఖుల రాక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మన్యంలో ఇప్పటికే బలగాలు కూంబింగ్‌లు చేపడుతున్నాయి. మావోలు జిల్లాలోకి చొచ్చుకు రాకుండా గాలింపు చేపడుతున్నారు.