ఖమ్మం

సజావుగా బదిలీల కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, జూన్ 24: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లోని పీజీహెచ్‌ఎంలకు, అన్ని సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లకు చేపట్టిన బదిలీల కౌనె్సలింగ్ సజావుగా జరిగిందని గిరిజన సంక్షేమశాఖ డీడీ సీహెచ్ రామ్మూర్తి తెలిపారు. భద్రాచలంలో బీఈడీ కళాశాలలో ఉమ్మడి ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమాల పీజీహెచ్‌ఎంలకు, స్కూల్ అసిస్టెంట్లకు ఆదివారం బదిలీలకు సంబంధించిన కౌనె్సలింగ్ డీడీ రామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సూచనలకు అనుగుణంగా మన్యం ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించామన్నారు. ఉద్యోగులైన భార్యభర్తలకు, వితంతువులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. పారదర్శకంగా, ఎటువంటి వివాదాలకు చోటు లేకుండా సీనియారిటీ జాబితాను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయులు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ కౌనె్సలింగ్ చేశామన్నారు. మొత్తం 130 మందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏటీడీవోలు జహీరుద్దీన్, లక్ష్మణ్‌బాబు, సత్యనారాయణ, పీఎంఆర్‌సీ ఏటీవో రమణయ్య, ఖమ్మం ఏటీడీవో వీరసోము, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ సాయన్న, కారం సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ ఉచిత శిక్షణ రాతపరీక్షకు 2479మంది హాజరు
ఖమ్మం(క్రైం), జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సై, కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలను ప్రకటించిన నేపధ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు గాను ఖమ్మం కలెక్టర్, పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో ఆదివారం ఆరు సెంటర్‌లలో రాత పరీక్ష నిర్వహించినట్లు అడిషనల్ డిసిపి కొల్లు సురేష్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2479మంది అభ్యర్థులు హాజరుకాగా ఇందులో 400మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారన్నారు. రాత పరీక్షా ఫలితాలు 2,3రోజులలో వెల్లడిస్తామని రాత పరీక్షలో అర్హత సాధించిన యువతకు ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, తల్లాడ, మధిర తదితర ట్రైనింగ్ సెంటర్ నందు రాత పరీక్షకు సంబందించిన శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణను పట్టణ, గ్రామీణ ప్రాంతాలనుండి వచ్చిన పేద విద్యార్థులు మంచి అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏసిపి గంటా వెంకట్రావు, రూరల్ ఏసిపి నరేష్‌రెడ్డి, కల్లూరు ఏసిపి రాజేష్, వైరా ఏసిపి ప్రసన్నకుమార్, సిఐలు తదితరులు పాల్గొన్నారు.