ఖమ్మం

రాజ్యాంగ విరుద్ధంగా మోదీ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూన్ 24: రాజ్యాంగ స్ఫూర్తికి దేశ రక్షణకు ప్రమాదం వాటిల్లేవిధంగా నరేంద్రమోదీ పరిపాలన సాగిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వద్ద కేసీఆర్ మోకరిల్లుతూ రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ఆదివారం స్థానిక శేషగిరిభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందుత్వాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేవిధంగా రాజకీయ ఎత్తుగడలకు కేంద్రంలోని బీజేపీ పాల్పడుతోందని ఆరోపించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టడంలో కెసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ముస్లిం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, నియోజకవర్గాల పునర్విభజనలను సాధించుకోలేక పోతున్నారని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రభుత్వం సమైక్యవాదులకు, తెలంగాణ ద్రోహులకు కేబినెట్‌లో పదవులు కట్టబెట్టి నిజమైన తెలంగాణవాదులను ద్రోహులుగా చిత్రీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక మంది యువకుల బలిదానాలు చేశారన్నారు. త్యాగాల పునాదులపై నిర్మించిన తెలంగాణ రాష్ట్రాన్ని సమైక్యవాదులు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ నుండి ప్రజలను రక్షించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాపోరాటాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని, సీబీఐ నీతి అయోగ్‌లను తమ స్వాధీనంలో ఉంచుకొని ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. కేంద్రప్రభుత్వంపై కేసీఆర్ వైఖరి స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కె సాబీర్‌పాషా, నాయకులు బొల్లోజు అయోధ్య, బందెల నర్సయ్య, బిక్కుల సత్యనారాయణ, ముత్యాల విశ్వనాధం, సారయ్య, బోళ్ళ సూర్యం, నరాటి ప్రసాద్, దుర్గరాశి వెంకన్న, వై శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శక్తి యాప్‌తో గుర్తింపు
* టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి
ఖమ్మం(క్రైం), జూన్ 24: శక్తి యాప్ ద్వారా కాంగ్రెస్ కార్యకర్త, నాయకులను గుర్తించ వచ్చని, వారి అభిప్రాయాలను తెలుసుకోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం శక్తి యాప్ ప్రాజెక్ట్‌పై కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ శక్తియాప్ ప్రాజెక్ట్‌లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు భాగస్వాములు కావాలన్నారు. పార్టీకి చెందినవారు ఏ స్థాయి వారైన తమ అభిప్రాయాలను, సూచనలను స్వేఛ్చగా తెలియజేయవచ్చన్నారు. దీని ద్వారా పార్టీ నిర్వహణలో ఎలాంటి లోటుపాటులున్న సరిదిద్దుకునే అవకాశాలున్నాయన్నారు. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ యాప్ కాంగ్రెస్ పార్టీ పరిష్టతకు ఎంతో దోహదపడుతుందన్నారు. గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి కార్యకర్త యాప్‌ద్వారా తమ మనోభావాలను వ్యక్తంచేసే అవకాశం ఉందన్నారు. ప్రతి కార్యకర్త తమ ఓటర్ ఐడి నెంబర్, ఫోన్ నెంబర్ మెస్సేజ్ చేస్తే శక్తియాప్ గ్రూప్‌లో చేరుతారన్నారు. ప్రతి ఒక్కరు శక్తి గ్రూప్‌లో నమోదు చేయించుకునే విధంగా గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా నాయకులను ఆదేశించారు. శక్తియాప్‌ను విజయవంతం చేసి పార్టీ పరిష్టతకు పాటుపడాలన్నారు. శక్తి ప్రాజెక్ట్ స్టేట్ కోఆర్డినేటర్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, ఎఐసిసి కోఆర్డినేటర్ స్వప్న, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తదితరులు పాల్గొన్నారు.