ఖమ్మం

నామా వల్లనే టీడీపీకి నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(ఖిల్లా), జూలై 17: నామా నాగేశ్వరావు వల్లనే తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. టిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో సీట్ల విషయంలో నామా స్వార్థం వల్లనే టిడిపి ఓడిపోయిందన్నారు. తాము టిఆర్‌ఎస్‌లో చేరడం ఫిరాయింపులు కావని జిల్లా అభివృద్ధికే అని స్పష్టం చేశారు. తాము టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి ఫిరాయింపుదారులు అనడం అవివేకమన్నారు. కార్యకర్తలకు అండగా ఉన్నానని చెబుతున్న నామా నాగేశ్వరావు ఏ కమిటీని కూడా సక్రమంగా సాగనీయలేదని ప్రతి విషయంలో అడ్డుకునేవాడని తెలిపారు. పాలేరులో అభివృద్ధి జరగడంలేదని అసత్య ప్రచారం చేస్తున్న నామా ఎంపీగా తాను ఏం అభివృద్ది చేశారో చెప్పాలన్నారు. అభివృద్ధికి నిదర్శనం టిఆర్‌ఎస్ అని చెబుతూ ప్రభుత్వం చేపట్టిన భక్తరామదాసు, మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరధ, డబుల్‌బెడ్రూం నిర్మాణాలు తదితర పథకాలను గుర్తుచేశారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ళలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని తెలుసుకోవాలని సూచించారు. విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, నాయకులు బెల్లం వేణు, సాధు రమేష్ రెడ్డి, నాగచంద్రారెడ్డి, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత
* ఎంపిడివో విద్యాలత
బోనకల్, జూలై 17: హరితహరం పథకం కింద గ్రామాల్లో మొక్కలు నాటడం ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా తీసుకోవాలని ఎంపిడివొ విద్యాలత కోరారు. మండల పరిధిలోని సీతానగరంలో హరితహారంలో భాగంగా మొక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపిడివొ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టిందన్నారు. మొక్కలు నాటడం వలన పర్యావరణాన్ని పరిరక్షించవచ్చునన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు, క్షేత్రస్ధాయి సిబ్బంది ఉద్యమంలా చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది అన్ని గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతుగా హరితహరం కార్యక్రమం విజయవంతం కొసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాలెంపాటి వాణి, ఏపివొ అప్పారావు, ఇసి లత, టిఏలు బాస్కర్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.