ఖమ్మం

ప్రజల అవసరాలే ఎజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 21: ప్రజల అవసరాలే ఎజెండాగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని, ప్రజల ఆత్మగౌరవ నినాదమే అంశంగా ఎన్నికల బరిలో దిగుతామని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ళుగా ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఎవరైనా తమ సమస్య తీర్చమని అడిగితే వారిపై నిర్బంధాన్ని ప్రయోగించారని దుయ్యబట్టారు. ఆత్మగౌరవంతో ప్రశాంతంగా జీవించే రైతులు తమపంట గిట్టుబాటుధర కావాలని అడిగితే వారిపై దేశద్రోహకేసులు పెట్టి, బేడీలు వేసి రోడ్లపై నడిపించిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని, అందుకే వారికి గుణపాఠం చెప్పేందుకు రైతులంతా సన్నద్ధం అవుతున్నారని స్పష్టం చేశారు. దళిత, బహుజనులపై చేసిన దాడులు కెసిఆర్ ప్రభుత్వ నియంతృత్వ విధానానికి గుర్తులుగా మిగిలాయన్నారు. ప్రస్తుత ఎన్నికలు సామాన్యులకు, దొరలకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నిరుద్యోగులకు ఉపాధి లేకపోగా నిర్బంధమే మిగిలిందని, ఉద్యోగులకు నిరాశే కలిగించిందని పేర్కొన్నారు. ఆశించిన లక్ష్యాలు సాధించడంతో పాటు ఆత్మగౌరవం కోసం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నివర్గాలను కలుపుకొని ముందుకెళ్తామన్నారు. బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతామని స్పష్టం చేశారు. మన నిధులు, నీళ్ళు, నియామకాలను తెస్తామని చెప్పి గద్దెనెక్కిన కెసిఆర్ అవి చేయలేక ముందస్తు ఎన్నికలకు పోయారని, తాము అధికారంలోకి వచ్చాక వాటిని చేసి చూపిస్తామని వెల్లడించారు.
కాగా ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తులు చివరిదశకు వచ్చాయన్నారు. అన్ని పార్టీలు ఆత్మగౌరవ ఎజెండాకే ప్రాధాన్యతనివ్వడం, గెలుపే లక్ష్యంగా పోటీచేసే అంశాలను పరిశీలించడం చరిత్రలో మొదటిసారి అన్నారు. తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సలహాలు, సూచనలతో వ్యూహాన్ని రచించి ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే మధిర నియోజకవర్గంలో ఆత్మగౌరవ యాత్రను చేపడుతున్నానని, రాష్టవ్య్రాప్తంగా దీనిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసినా చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అంతిమంగా విజేతలవుతారని స్పష్టం చేశారు.