ఖమ్మం

108 ప్రసాదాలతో గణపతికి నైవేద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, సెప్టెంబర్ 21: చర్లలో ముత్యాలమ్మ వీధిలో కొలువైన శ్రీ విజయ గణపతికి గురువారం సాయంత్రం 108 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పించి పూజించారు. చర్ల మెయిన్‌రోడ్డు సెంటర్ పక్కన ఉన్న ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో గత 15 సంవత్సరాల నుంచి పెద్దలు, యువకులు కలిసి ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా గణపతిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేపడుతున్నారని ఆలయ కమిటీ తెలిపింది. పూజా కార్యక్రమాలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరై పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు చేస్తున్నారని వారు తెలిపారు. గణపతి నవరాత్రులు సోమవారంతో ముగుస్తాయని, ఆ రోజు అధిక సంఖ్యలో భక్తులు ఊరేగింపు, నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఆశపు అచ్చిరాజు, కుప్పాల ముత్తయ్య, ముత్యాలమ్మ వీధి యూత్ తదితరులు పాల్గొన్నారు.

గణేష్ మండపాల వద్ద మహా అన్నదానాలు-్భజనలు
కామేపల్లి, సెప్టెంబర్ 21: గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాల వద్ద మహా అన్నదాన కార్యక్రమాలు, ప్రత్యేక భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కామేపల్లిలోని ఎంపి సెంటర్‌లో ఏర్పాటు చేసిన భారీ మండపం వద్ద స్థానిక అవదూతేంద్ర భక్తమండలి ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. అవధూతేంద్ర భక్తమండలి అధ్యక్షుడు గొత్తుపర్తి శివాజీ నేతృత్వంలో గణపతి భక్తి గీతాలు, హనుమాన్ చాలీసా పారాయణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అదే విధంగా మండలంలోని పండితాపురంలో బిసి సెంటర్‌లో ఏర్పాటు చేసిన మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జడ్పీటిసి మేకల మల్లిబాబుయాదవ్, టిఆర్‌ఎస్ నాయకులు నర్సింహానాయక్ తదితరులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గణేష్ నిమజ్జనానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
* పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం(క్రైం), సెప్టెంబర్ 21: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. శుక్రవారం నిమజ్జన ప్రాంతాలైన కాల్వొడ్డు ప్రాంతంలోని మునే్నరు నదిని నగర మేయర్ పాపాలాల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో నిమజ్జన ఏర్పాట్లకోసం చేపడుతున్న భద్రతా చర్యలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న జరగనున్న 2737 వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, ఆర్ అండ్ బి, వైద్య, విద్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంచనీయ సంఘనటలు జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ క్రేన్‌లు, బార్ కేట్లను ఏర్పాటుచేసి నిరంతరం పోలీస్ నిఘాలో ఉంచుతున్నామన్నారు. ఖమ్మం డివిజన్‌లో దాదాపు వెయ్యి విగ్రహాలను రెండు ప్రాంతాలలో నిమజ్జనం చేసే అలోచన ఉందని ఆ ప్రాంతాలలో సిసి కెమేరాలు ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 10గంటలలోపు నిమజ్జనం ముగిసే విధంగా ఉత్సవ కమిటీలు చొరవ తీసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో ఒక్కో వాహనం వెంట నలుగురిని మాత్రమే లోనికి అనుమతించాలని ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమంలో డిజెలకు అనుమతి లేదన్నారు. ప్రశాంత వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో వ్యవహరించి గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు తమ వంతుగా సహాకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్పొరేషన్ కమిషనర్ కె శ్రీనివాసరావు, అడిషనల్ డిసిపి మురళీదర్, ఎసిపి గంటా వెంకట్రావు, అసిస్టెంట్ కమిషనర్ జగన్, సుభ్రమణ్యం, మనోహర్, సిఐలు షుకూర్, వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.