ఖమ్మం

ప్రగతికి పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంసూరు, సెప్టెంబర్ 21: దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శవంతంగా అభివృద్థి చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, సత్తుపల్లి నియోజకవర్గం టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పిడమర్తి రవి అన్నారు. మండల పరిధిలోని కుంచపర్తి గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్దపీట వేసి వారి అభివృద్థి సంక్షేమం కోసం ప్రాజెక్టుల నిర్మాణాలు, చెరువుల అభివృద్థి, రైతుకు పంటసాయం, రైతుబీమా , పంటరుణమాఫీ చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్నో ఏళ్ళ తరబడి భూమి ఉండి పాస్ పుస్తకాలకు నోచుకోని రైతులకు భూసమస్యలు పరిష్కరించిన ప్రభుత్వం కూడా తెలంగాణ మాత్రమే అన్నారు. అంతరిస్తున్న కుల వృత్తులకు ప్రోత్సాహాలు అందించి వారిని ఆర్థికంగా ఎదిగేందుకు చేయూతనిచ్చిన ప్రభుత్వం మనదే అన్నారు. పేదల ఇంట ఆడబిడ్డల పెళ్ళిళ్ళు సమస్య కారాదని గుర్తించిన ముఖ్యమంత్రి కెసిఆర్ నేనున్నానంటూ ముందుకొచ్చి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అందించి ఆదుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. టిఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక గుంపులు గుంపులుగా ఏకం అవుతున్నారని, అటువంటి ఎన్ని గుంపులు ఏకమైనా విజయం మనదే అన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు జగన్మోహనరావు, గంగరాజు, మేడా రమేష్, గుత్తా వెంకటేశ్వరరావు, మందపాటి వేణుగోపాలరెడ్డి, పెయ్యల యాకోబు, కుక్కపల్లి రామకృష్ణ, అంజన్‌రావు, నారాయణరెడ్డి, నెల్లూరు గోపాలకృష్ణ, నరశింహారావు, వల్లభనేని సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

తాలిపేరుకు వరద తాకిడి
చర్ల, సెప్టెంబర్ 21: అల్పపీడన ద్రోణి వల్ల ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో చింతనార్, ధర్మారం, పామేరు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాలకు చింతవాగు ఉధృతంగా ప్రవహించి తాలిపేరు గుండా రావడంతో మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో శుక్రవారం 8 గేట్లు ఎత్తి 23,600 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. 8 గేట్లలో 5 గేట్లను ఐదడుగుల మేర, 3 గేట్లను మూడు అడుగుల మేర ఎత్తి ముందస్తు జాగ్రత్త కోసం నీటిని విడుదల చేశామని ఇరిగేషన్ డీఈ తిరుపతిరావు తెలిపారు. ప్రస్తుతం తాలిపేరు వద్ద నీటిమట్టం 73.95 ఉన్నట్లు ఆయన తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.