ఖమ్మం

ప్రభుత్వ అసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 21: రోగులకు సరిపడా పడకలు ఏర్పాటుచేసి వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. జ్వరాలతో బాధపడుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై అడిగితెలుసుకున్నారు. ఆసుపత్రిలో పురుషులు, మహిళా వార్డులను కలియతిరిగారు. ఆసుపత్రి ఆవరణంలోని వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌ను పరిశీలించారు. వైద్య పరీక్షల నిర్వహణలో రోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఉన్నాయని జ్వరబాధితులు, రోగులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. రోగులు ప్రైవేటు ఆసుపత్రులు ఆశ్రయించి ఆర్థికంగా కుంగిపోతున్నారని ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలోని రోగులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోగులకు అందిస్తున్న సేవలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మదన్‌సింగ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విషజ్వరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. ఈ జ్వరాలు సోకడంతో ప్రజలు భయాందోలనలకు గురౌతున్నారని, జ్వరాలు సోకిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సూచించారు. జ్వరాలతో భయపడాల్సిన పనిలేదని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కళావతిబాయి, వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.