ఖమ్మం

ఖమ్మం గెలుపే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 25: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం గెలుపే కీలకంగా మారనున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తిరిగి రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకువస్తాయన్నారు. పేదలకు ఇండ్లు, సాగు,తాగునీటి పథకాలతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధివైపు తీసుకుపోయిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఖమ్మం అసెంబ్లీ అభివృద్ధికి కోట్లాది రూపాయలను వెచ్చించామన్నారు. ఖమ్మం నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మం నియోజక అభివృద్ధికి తన శక్తివంచన లేకుండ పాటుపడ్డానన్నారు. లకారం చెరువు ఆధునీకరణ, మురుగుకుపంగా మారిన త్రీటౌన్ ప్రాంత అభివృద్ధి, రోడ్ల విస్తరణకు అత్యంత ప్రాదాన్యతనిచ్చి ఖమ్మంను సుందరంగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకున్నానన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాల లబ్దిదారులకు స్వయంగా వారి ఇండ్ల వద్దకు వెళ్ళి అందించానని గుర్తుచేశారు. తాను నాలుగన్నర కాలంలో ఖమ్మంను అభివృద్ధిలో ముందుంచానన్నారు. టిఆర్‌ఎస్ ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి చైతన్యం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఎంపి పొంగుగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధివైపు భారతదేశం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి బాలసాని, జిల్లా అధ్యక్షుడు బేగ్, నల్లమల, ఆర్‌జెసి, మురళి టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ముగిసిన జోనల్‌స్థాయి క్రీడాపోటీలు
కూసుమంచి, సెప్టెంబర్ 25: కూసుమంచి ప్రాధమిక ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న జోన్ పాఠశాలల క్రీడా పోటీలు విజయవంతంగా మంగళవారం ముగిసాయి. 100,200,400,600,800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్ విభాగాలలో ఇద్దరు చొప్పున ఎంపిక చేసి జోన్ జట్లను సిద్దం చేశారు. బుధవారం నుండి ఖమ్మం సర్దార్‌పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి అథ్లెటిక్ పొటీలు రెండు రోజుల పాటు జరుగనున్నాయని కూసుమంచి పిడి నరసింహమూర్తి తెలిపారు. 100మీటర్ల బాలుర విభాగంలో బి దేవేందర్, బి శ్రీనివాస్ (కూసుమంచి) పి సాయి ప్రకాశ్(నేలకొండపల్లి), 200మీటర్ల విబాగంలో బి దేవేందర్, ఆర్ సురేష్(కూసుమంచి), పి సాయిప్రకాశ్(నేలకొండపల్లి) 800మీటర్ల విబాగంలో పి సాయిప్రకాశ్(నేలకొండపల్లి), ఆర్ శివరామ్ ప్రసాద్(నేలకొండపల్లి), బాబురావు(కూసుమంచి)లు, లాంగ్‌జంప్ విభాగంలో బి తరుణ్, బి సంతోష్(కూసుమంచి) నాగాచారి (నేలకొండపల్లి), షాట్‌పుట్ విభాగంలో హెచ్ శివ(కూసుమంచి) టి బార్గవ్(నేలకొండపల్లి), కె వీనీల్(తిరుమలాయపాలెం)లు గెలుపొందారు. బాలికల విభాగంలో షాట్‌పుట్ విభాగంలో సిహెచ్ కళ్యాణి, వై లావణ్య(నేలకొండపల్లి), జె నిఖిల(కూసుమంచి) లాంగ్‌జంప్ విభాగంలో భార్గవి, జె నిఖిల(కూసుమంచి) బి అనిత(తిరుమలాయపాలెం), అదే విధంగా 100మీటర్ల విభాగంలో సుప్రజ(నేలకొండపల్లి), పి శ్రీలేఖ, ఆర్ ఇందు(కూసుమంచి) 200మీటర్ల విభాగంలో భార్గవి, భవాని(కూసుమంచి), కె పల్లవి(నేలకొండపల్లి) 800మీటర్ల విభాగంలో బిప్రత్యూష(నేలకొండపల్లి), భార్గవి, భవాని(కూసుమంచి)లు ఎంపికయ్యారు. ఈ ఎంపికలలో తిరుమలాయపాలెం పిడి నర్సింహరెడ్డి, నేలకొండపల్లి పిడి శ్రీనివాస్, మూడు మండలాలలకు చెందిన పిఇటిలు పాల్గొన్నారు.