ఖమ్మం

పర్యాటక రంగంగా ఖమ్మం అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 25: ఖమ్మంను పర్యాటక కేంద్రంగా తీర్చదిద్దనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. ప్రపంచ పర్యటక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఖమ్మంలోని ఖిల్లాను ఆయన సందర్శించారు. ఈ నెల 16నుండి 27వరకు నిర్వహించనున్న పర్యాటన్‌పర్వ్‌లో భాగంగా ఖిల్లాకోట వద్ద నిర్వహించిన హెరిటేజ్‌వాక్‌ను కలెక్టర్ జెండాఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పర్యాటక ప్రాంతానికి ప్రసిద్దిగాంచిందని, జిల్లాలో పలు పర్యాటక కేంద్రాలు పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు. నగరం నడిబొడ్డులో ఉన్న ఖిల్లాను అభివృద్ధి పరచేందుకు ప్రతిపాధనలు సిద్దం చేయాలని పర్యాటక శాఖాధికారులను ఆదేశించారు. ఖిల్లాను పరిరక్షించుకోవడంతో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచడం ద్వారా ఖమ్మం నగర ఖ్యాతి మరింత ఇనుమడింపచేస్తుందన్నారు. ఖిల్లాకోట లోపల కట్టడాలు ఇప్పటికీ సందర్శికులను ఎంతగానో ఆకర్షింపజేయడంతో పాటు ఆలోచించే విధంగా ఉన్నాయన్నారు. పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల స్థాయి విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లండించారు. ఖిల్లాలోని ఓటింగ్ నమోదు కేంద్రాలను ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో నగరమేయర్ డాక్టర్ పాపాలాల్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఖమర్, డిప్యూటి మేయర్ మురళీప్రసాద్, కార్పొరేషన్ కమిషనర్ జె శ్రీనివాసరావు, అధికారులు సుమన్‌చక్రవర్తి, పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు.