ఖమ్మం

టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, సెప్టెంబర్ 25: పోరాడి సాధించి తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయటం చేతగాని తెలంగాణ ప్రభుత్వం దున్నపోతు నిద్ర పోతున్నదని దానిని తెలంగాణ నుండి తరిమి కొట్టాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. రెండవ విడత ఆత్మ గౌరవ యాత్రను మంగళవారం మీనవోలు నుండి డప్పు కొట్టి ప్రారంభించారు. అనంతరం మీనవోలులో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మీనవోలు నుండి తక్కెళ్ళపాడు, సఖినవీడు, మొలుగుమాడు, ఇనగాలి, రామన్నపాలెం తదితర గ్రామాలలో సాగిన ఆత్మ గౌరవ యాత్రకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లనే పేదలకు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరిగిందని ఆయన తెలిపారు. పేదలకు సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేసారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర సంవత్సరాలు అయినా ఏ ఓక్క వర్గానికి మేలు జరగలేదన్నారు. కాగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగ నియమాకాల ప్రక్రియ చేపడతామన్నారు. కేసిఆర్‌ని, జిల్లా మంత్రిని, కమిషన్ ఏజంట్లుగా ఈ పార్టీల నుండి చేరిన నాయకులను ఇంటికో ఉద్యోగం, గిరిజనులకు, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు, దళితులకు 3ఎకరాలు, ఇందిరమ్మ ఇళ్ళు, డబల్‌బెడ్‌రూం ఇళ్ళు ఏమైయ్యాయని విమర్శించారు. మండలంలో ఎంత మందికి డబల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చారో చెప్పే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాదించి పీపుల్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేయటం తధ్యమని విక్రమార్క ధీమా వ్యక్తం చేసారు.గద్దర్, విమలక్క,సుధాకర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆలోచన చేస్తున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నరిశింహరావు, శీలం నర్సిరెడ్డి, కడియం శ్రీనివాసరావు., అనుమోలు కృష్ణారావు, బొగ్గుల గోవర్ధనరెడ్డి, గంటా తిరపతమ్మ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మహా కూటమికి మహాపరాభవం ఖాయం
* మంత్రి తుమ్మల
దమ్మపేట, సెప్టెంబర్ 25: మహాకూటమిగా ఏర్పడి ఎన్నికల గోదాలోకి వస్తున్న విపక్ష పార్టీలకు మహా పరాభవం ఖాయమని అపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరావుజోస్యం చెప్పారు. మండల పరిధిలోని మందలపల్లి క్రాస్‌రొడ్స్ సమీపంలో అశ్వారావుపేట నియోజకవర్గ టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం మంగళవారం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తుమ్మల, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్‌తో ఆంధ్ర ప్రయోజనాలకోసం పోట్లాడే తెలుగుదేశం జట్టు కట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ధ్రుతరాష్ట్ర కౌగిలిలో జట్టుకట్టే పార్టీలు బతికి బట్ట కట్టలేవన్నారు. రాష్ట్రంలో, జిల్లాలో నాయకత్వం లేని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండానే అన్ని స్థానాల్లో గెలుస్తామంటున్నదని విమర్శించారు. త్వరలో గోదావరి జలాలు తీసుకొచ్చి బీడు భూములను సాగులోకి తీసుకొస్తామన్నారు. జిల్లాలో బలమైన నాయకులున్న తమ పార్టీ అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుందన్న ఆశాభావం మంత్రి వ్యక్తం చేశారు.
వర్గాలున్నా పార్టీకోసం పని చేస్తాం...
తమ పార్టీలో వర్గాలున్నా పార్టీకోసం కలిసి పని చేస్తామని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాటిని గిరిజన పక్షపాతిగా ప్రచారం చేశారని కాని ఆయన గిరిజన గిరిజనేతర ఐక్యతకు కృషి చేశారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరగులు పెట్టించి దేశంలో నెంబర్‌వన్‌గా నిలిపిన ఘనత కెసిఆర్‌కు దక్కుతుందన్నారు. అనంతరం మాట్లాడిన జలగం రాజకీయ ప్రత్యర్థులమే కాని శత్రువులు కామని వర్గాలపై స్పష్టతనిచ్చారు. ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు దక్కవన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు, పార్టీ అధ్యక్షులు నాయకులు ఆలపాటి ప్రసాదు, పైడి వెంకటేశ్వరావు, కెవి సత్యనారాయణ, దారా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.