ఖమ్మం

సింగరేణి అధికారులకు కోలిండియా వేతనాలను అమలుచేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, సెప్టెంబర్ 25: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులకు కోలిండియా స్థాయిలో కొత్త వేతనాలను అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సింగరేణి కాలరీస్ చైర్మన్ అండ్ మేనేజంగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. మంగళవారం సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్‌లో జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు కార్మికులు, ఉద్యోగులు సమిష్టి కృషి జరపాలని పిలుపునిచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైన బొగ్గును స్వదేశం నుండే అందించే విధంగా ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలన్నారు. విదేశీ బొగ్గు దిగుమతులను తగ్గించాల్సిన అవసరం వుందన్నారు. బొగ్గు ఉత్పత్తికి అవసరమైన కొత్తడంపర్లు, డోజర్లను కొనుగోలు చేసేందుకు పంపిన ప్రతిపాదనను ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. ఓబి తొలగింపు పనులను వేగవంతం చేయాలన్నారు. కోలిండియా అధికారులకు అమలవుతున్న కొత్త వేతనాలను సింగరేణిలో కూడా అందించేందుకు బోర్డు ఆమోదించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు ప్రతి 5 సంవత్సరాలకు వేతన సవరణ జరుగుతుండగా అధికారులకు మాత్రం 10 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరుపుతున్నామన్నారు. సింగరేణిలో సెప్టెంబర్ నెలలోనే కొత్తవేతనాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు సొంతింటి నిర్మాణానికి వడ్డీలేని రూ 10 లక్షలను చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో రాష్ట్ర ఇంధన ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, కేంద్ర బొగ్గుమంత్రిత్వశాఖ డైరెక్టర్ సయ్యద్ అప్రాష్, కెఎస్ బింద్రా, సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్, సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్ శంకర్, డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ భాస్కర్‌రావు, కంపెనీ కార్యదర్శి గుండా శ్రీనివాస్, జనరల్ మేనేజర్ అంతోని రాజ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధం
* బిజెపి రాష్టన్రేత చిలుకూరి రమేష్
జూలూరుపాడు, సెప్టెంబర్ 25: రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి తగు విధంగా గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిలుకూరి రమేష్ అన్నారు. మంగళవారం జూలూరుపాడులో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నాలుగన్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అబద్దపు ప్రచారాలతో కాలయాపనచేసి పూర్తి పదవీకాలం పాలన సాగించకుండానే ముందుగానే ఎన్నికలకు ఎందుకు వెళ్లారో పాలకులు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన, ఆయుష్మాన్‌భవ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రుల్లో రూ 5లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందే అవకాశం ఉందన్నారు. ఈ పథకానికి కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులను కేటాయించాల్సి ఉండగా, ఈ నిర్ణయాన్ని రాష్ట్రం అంగీకరించకపోవటం శోచనీయకరమని ఆయన అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు వ్యాప్తిచెంది ప్రజలు అల్లాడుతున్నా ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని సక్రమంగా అమలు చేయటంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కెసిఆర్ నేటికీ ఒక్క కుటుంబానికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. చివరకు పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలాయం అభివృద్ధికి రూ 100కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పిన పాలకులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవటం వారి చిత్తశుద్దికి అద్దం పడుతుందన్నారు. బంగారు తెలంగాణ సాధన పేరుతో ప్రజలను వంచనకు గురిచేసిన టిఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల్లో బుద్దిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు శిరిపురపు ప్రసాద్, నాయకులు జాట్ల నరేష్, ఉర్లమెట్టి రవి, పుల్లారావు, సుబ్బు, కృష్ణ, నవీన్, గోపాలరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.